https://oktelugu.com/

Prabhas Assets: ప్రభాస్ ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే…

ప్రభాస్ భారీ రేంజ్ లో రెమ్యూన్ రేషన్ తీసుకుంటున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రభాస్ ఒక సినిమా కోసం 150 కోట్ల వరకు రేమ్యున్ రేషన్ తీసుకుంటున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2023 / 11:18 AM IST

    Prabhas Assets

    Follow us on

    Prabhas Assets: ప్రభాస్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఆయన పాన్ ఇండియా రేంజ్ లో చేసిన బాహుబలి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇక ఇది రెండు పార్టు లుగా వచ్చినప్పటికీ ఆ రెండు పార్టీలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేశాయి.ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా చేశాడు.

    ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ రేంజ్ లో రెమ్యూన్ రేషన్ తీసుకుంటున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రభాస్ ఒక సినిమా కోసం 150 కోట్ల వరకు రేమ్యున్ రేషన్ తీసుకుంటున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఒక న్యూస్ ఫిలింనగర్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. అది ఏంటి అంటే ప్రభాస్ మొత్తం ఆస్తి ఎంత అనే దాని పైన నానా రకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. నిజానికి ప్రభాస్ దగ్గర ఇప్పుడున్న ఆ స్తి విలువ దాదాపు గా 3500 నుంచి 4 వేల కోట్ల వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది.

    హైదరాబాదులోనే అతనికి మూడు నుంచి నాలుగు ఖరీదైన ఇల్లులు ఉన్నాయి.ఇక ఇప్పటికే చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇక ఇవి పోను ఆయనకి ఖరీదైన కార్లు అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక యూవీ క్రియేషన్స్ లో కూడా ప్రభాస్ కి చాలా ఎక్కువ మొత్తం లో పర్సంటేజ్ ఉన్నట్టు గా తెలుస్తుంది. అలాగే ఆయనకి చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇక ఇదంతా కలుపుకుంటే ఆయన నెట్ వర్త్ వచ్చేసి 4000 కోట్ల వరకు ఉంటుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక మొదటి నుంచి కూడా ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీకి ఆస్తులు ఎక్కువగానే ఉండేవి ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రభాస్ హీరో అయిన తర్వాత కూడా చాలా డబ్బుల్ని వెనకేశాడు. అలాగే కొన్ని బిజినెస్ లలో కూడా పెట్టు బడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అన్నీ కలిపితే ఆయన దగ్గర ఉన్న ఆస్తుల విలువ 4 వేల కోట్ల వరకు ఉంటుందంటే మామూలు విషయం కాదు…

    ప్రభాస్ రాజుల ఫ్యామిలీ కి చెందిన వ్యక్తి కావడం వల్ల స్వతహాగానే వాళ్లకు ముందు నుంచి కూడా చాలా డబ్బులు ఉన్నాయి…ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం ప్రొడ్యూసర్లు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చే సినిమా చేయించుకో వాడానికి రెడీ గా ఉన్నట్టు గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఉన్న మార్కెట్ ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేదనే చెప్పాలి. ఆయన సినిమాలు ఈజీగా భారీ కలక్షన్స్ ని వసూలు చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి క్రమంలో ప్రభాస్ ఆస్తుల విలువ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది…