https://oktelugu.com/

Venkatesh: వెంకటేష్ ని రిజెక్ట్ చేసిన ఆ హీరోయిన్ కారణం ఏంటో తెలుసా..?

వెంకటేష్ హీరోగా వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో తనని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ క్యారెక్టర్ తనకి నచ్చకపోవడంతో ఆమె ఆ సినిమాని రిజక్ట్ చేసినట్టుగా వార్తలైతే వచ్చాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2024 / 09:25 AM IST

    Venkatesh

    Follow us on

    Venkatesh: తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో వెంకటేష్. ఈయన హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈయన ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ అనే పేరు సంపాదించుకున్నాడు. శోభన్ బాబు ఫ్యామిలీ సినిమాలు తీస్తూ ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తరంలో వెంకటేష్ కూడా అలాంటి ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు.

    అయితే అప్పట్లో వెంకటేష్ తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం పోటీపడేవారు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన సౌందర్య, మీనా, రమ్యకృష్ణ లాంటి టాప్ హీరోయిన్లతో సినిమాలు చేశాడు. అయితే ఒక హీరోయిన్ మాత్రం వెంకటేష్ ని రిజెక్ట్ చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు హల్చల్ చేశాయి. ఆమె ఎవరు అంటే బంగారు బుల్లోడు అనే సినిమాలో బాలయ్య బాబు పక్కన హీరోయిన్ గా నటించిన రవీనా టండన్…

    అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో తనని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆ క్యారెక్టర్ తనకి నచ్చకపోవడంతో ఆమె ఆ సినిమాని రిజక్ట్ చేసినట్టుగా వార్తలైతే వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం శిల్పా శెట్టి ని తీసుకున్నారు. ఈ సినిమా ఆవరేజ్ గా ఆడినప్పటికీ ఆ క్యారెక్టర్ లో చేసిన శిల్పా శెట్టి కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇక అప్పుడు రవీనా టాండన్ అలా చేయడంతో వెంకటేష్ తన తరువాత సినిమాల్లో కూడా ఆమెను ఎప్పుడు తీసుకోవాలనే ప్రయత్నం చేయలేదు. అలా వెంకటేష్ తో సినిమా చేసే అవకాశాన్ని రావీనా కోల్పోయిందనే చెప్పాలి.

    ఇక వెంకటేష్ అప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా తీర్చిదిద్దాడు. ఇక అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…ప్రస్తుతం వెంకటేష్ ఈ సినిమాతో సక్సెస్ కొడితే సీనియర్ హీరోల్లో మంచి సక్సెస్ అందుకున్న హీరోగా తనకంటు ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకుంటాడు…