Tollywood Heroines : సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఈ హీరోయిన్స్ వయసు తెలుసా?

మన తెలుగు ఇండస్ట్రీలో రెండు పదులు పెట్టకముందే హీరోయిన్ గా వచ్చిన వారు ఎంతోమంది. అలా అని రెండు పదలు దాటాక వచ్చిన హీరోయిన్స్ లేదు అని కాదు, కానీ ఎక్కువ శాతం చిన్నప్పుడు వచ్చినవారే. మరి మన హీరోయిన్స్ ఏ వయసులో సినిమాలో అడుగు పెట్టారో చూద్దాం…

Written By: Swathi Chilukuri, Updated On : August 6, 2023 5:51 pm
Follow us on

Tollywood Heroines : మన తెలుగు ఇండస్ట్రీలో రెండు పదులు పెట్టకముందే హీరోయిన్ గా వచ్చిన వారు ఎంతోమంది. అలా అని రెండు పదలు దాటాక వచ్చిన హీరోయిన్స్ లేదు అని కాదు, కానీ ఎక్కువ శాతం చిన్నప్పుడు వచ్చినవారే. మరి మన హీరోయిన్స్ ఏ వయసులో సినిమాలో అడుగు పెట్టారో చూద్దాం…

కృతి శెట్టి

కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్. రామ్ చేసిన ది వారియర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ నటి. ఇక వైష్ణవి తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో తెలుగుదలకు పరిచయమైన కృతి శెట్టి, ఆ సినిమాలో నథింగ్ నప్పుడు తన వయసు 17 సంవత్సరాలు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమా 2021లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.

తమన్నా

అతి చిన్న వయసులోనే సినీ రంగానికి ప్రవేశించిన నేటితరం హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తన తొలి చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా 2005లో విడుదలైనప్పుడు తమన్నా వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అదే సంవత్సరం తెలుగులో కూడా మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమా ద్వారా పరిచయమైంది ఈ హీరోయిన్.

సమంత

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ సమంత. ఈ నటి 2010లో విడుదలైన ఏం మాయ చేసావే సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన మాజీ భర్త నాగచైతన్యతో కలిసి నటించింది సమంత. అయితే ఈ సినిమా చేసినప్పుడు సమంత వయసు 23 సంవత్సరములు.

పూజా హెగ్డే

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చెయ్యడంలో పూజా హెగ్డే ముందు అంజలో ఉంది. తెలుగు వాడికి ముకుందా సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్, ‌ సినిమా రంగంలోకి తరంగెత్రం చేసింది మాత్రం తమిళ చిత్రం అయినటువంటి మాస్క్ అనే సినిమా తో. ఈ సినిమా చేసినప్పుడు పూజా హెగ్డే వయసు 22 సంవత్సరాల అంట.

కీర్తి సురేష్

మహానటి సినిమాతో ఎన్నో అవార్డులు అందుకొని తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. అయితే పూర్తి స్థాయి హీరోయిన్ గా మాత్రం కీర్తి సురేష్ చేసిన చిత్రం 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి. 1992లో జన్మించిన ఈ నటికి హీరోయిన్ గా తన మొదటి సినిమా చేసినప్పుడు వయసు 21 సంవత్సరాలు.

సాయి పల్లవి

ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ అందరిని ఫిదా చేసేసింది సాయి పల్లవి. కానీ ఈ సినిమా కన్నా ముందే సాయి పల్లవి అంతే తెలియని వారెవరు లేరు. ఎందుకంటే ఆమె నటించిన మలయాళీ చిత్రం ప్రేమమ్ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వనప్పటికి పాన్ ఇండియా లెవెల్ లో ఆమెకి క్రేజ్ మాత్రం తెచ్చిపెట్టింది. చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయమైంది మాత్రం ఈ ప్రేమమ్ సినిమాతోనే. ఈ సినిమా అప్పుడు సాయి పల్లవి వయస్సు 23 సంవత్సరాలు.

శ్రీ లీల

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న శ్రీ లీల జన్మించింది 2001 వ సంవత్సరం. ఇక ఈ హీరోయిన్ నటించిన మొదట కనడ చిత్రం విడుదలైంది 2019లో. అంతే 18 సంవత్సరాలకి శ్రీ లీల సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 22 సంవత్సరాలు.