https://oktelugu.com/

Astronauts Life Style: అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో తెలుసా.. అక్కడి అనేక ప్రతికూలతలు..

అంతరిక్షంలోకి వెళ్లే వారికి ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషనే గమ్యం. ప్రపంచంలో ఏదేశం ఆస్ట్రోనాట్స్‌ను పంపినా వారు చేరుకునేది ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కే.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 31, 2023 / 03:59 PM IST

    Astronauts Life Style

    Follow us on

    Astronauts Life Style: అంతరిక్షం.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. అయితే ఇది ఎక్కడ ఉంటుంది.. సైటిస్టులు అక్కడికి పంపేవారు అక్కడ ఏం చేస్తారు.. ఎన్ని రోజులు ఉంటారు.. ఎలా జీవిస్తారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. భూమి మీది నుంచి పంపించే ఉప గ్రహాలన్నీ ఈ స్పేస్‌ స్టేషన్‌(అంతరిక్షం)తో అనుసంధానమై ఉంటాయి. దీంతో తరచూ శాస్త్రవేత్తలు ఈ స్పేష్‌ స్టేషన్‌కు పంపించి స్టేషన్‌ నిర్వహణ, మరమ్మతులు, ఇతర పనులు చేపడతారు. ఇలా అంతరిక్ష యానం మొదట 1960లో యూరిగగారిన్‌తో ప్రారంభమైంది.

    వేరే అనుభూతి..
    అంతరిక్షంలోకి వెళ్లే వారికి ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషనే గమ్యం. ప్రపంచంలో ఏదేశం ఆస్ట్రోనాట్స్‌ను పంపినా వారు చేరుకునేది ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కే. ఇది భూమి నుంచి సుమారు 400 ఎత్తులో ఉంటుంది. దీనిని అమెరికాతోపాటు 16రు దేశాలు కలిసి 120 బిలియన్‌ డాటర్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేశాయి. ఇక్కడికి ఆస్ట్రోనాట్స్‌ ప్రత్యేక వాహనంలో చేరుకుంటారు. అక్కడ వివిధ రకాల పనులు చేస్తారు. అవసరమేతే స్పేస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చి స్పేస్‌ వాక్‌ కూడా చేస్తారు.

    ఈ ఐదు పనులు తప్పనిసరి..
    అయితే అంతరిక్ష యానం భూమి మీద ఒక ఊరి నుంచి మరో ఊరికి.. లేదా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినంత ఈజీగా ఉండదు. విదేశాలకు వెళితేనే అక్కడి వాతావరణ, ఆహారపు అలవాట్లు, సంస్కృతి భిన్నంగా అనిపిస్తాయి. అలాంటిది భూమికి సంబంధం లేని ప్రాంతానికి వెళితే మామూలుగా ఉంటుందా. అందుకే అక్కడకు వెళ్లిన వారిని ఆస్ట్రోనాట్స్‌ అంటారు. అంతేకాదు అక్కడకు వెళ్లడానికి వారు ప్రత్యేక సూట్‌ ధరిస్తారు. ఇక అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్‌ తప్పనిసరిగా ఈ ఐదు పనులు చేయాల్సి ఉంటుంది. మొదటిది స్పేస్‌ అధ్యనం, రెండోది స్పేస్‌ స్టేషన్‌ నిర్వహణ, మరమ్మతులు, మూడోది రోజూ వ్యాయామం. ఇది ప్రతీ ఆస్ట్రోనాట్‌కు అవసరం. నాలుగోది స్పేస్‌ స్టేషన్‌ బయట మరమ్మతులు చేయడం. ఐదోవది విశ్రాంతి తీసుకోవడం. ఈ ఐదు అక్కడకు వెళ్లినవారు చేసే పనులు. వీటితోపాటు తినడం, తాగడం, టాయిలెట్‌కు వెళ్లడం, చదవడం, నిద్రపోవడం చేస్తుంటారు.

    బాడీలో మార్పులు..
    ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌కు వెళ్లిన ఆస్ట్రోనాట్స్‌ శరీరంలో మార్పులు జరుగుతాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి విడిపోయినందున వారి శరీరం తేలిక అవుతుంది. ఎముకలు, కండరాలు ఉన్నట్లు తెలియవు. అందుకే వారు నిత్యం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే తర్వాత ఎముకలు, కండరాలు పనిచేయవు. అందుకే నిత్యం ఆస్ట్రోనాట్స్‌ వ్యాయామం చేస్తారు.

    బ్రష్‌ ఎలా చేస్తారో తెలుసా..
    ఇక ఆస్ట్రోనాట్స్‌ బ్రష్‌ ఎలా చేస్తారు అన్న సందేహాలు కలుగుతాయి. ఎందుకంటే గురుత్వాకర్షణ లేని కారణంగా అక్కడ అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. మన శరీరం కూడా తేలుతూ ఉంటుంది. అందుకే అక్కడ బ్రష్‌ చేసుకోవడం చాలా కష్టం. అయితే ఆస్ట్రోనాట్స్‌ బ్రష్‌ పైకి పట్టుకుని పేస్ట్‌ పెట్టుకుంటారు. నురగ బయటకు రాకుండా నోరు మూసుకునే బ్రష్‌ చేసుకుంటారు. ఇక ఆ నురగను కూడా వారు మింగుతారు.

    ఇక ఒకటి, రెండుకు ఎలా..
    ఇక ఆస్ట్రోనాట్స్‌ టాలెట్‌ యూసింగ్‌ ఇక్కడ విచిత్రంగా ఉంటుంది. టాయిలెట్‌ బయటకు వస్తే అది గాలిలో తేలుతుంది. అందుకోసం స్పేస్‌ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పైపు ఉంటుంది. దానికి మూత్ర విసర్జన అవయవాలకు అమర్చుకుని టాయిలెట్‌ చేస్తారు. ఒక రెంటికి కూడా ప్రత్యేక బాక్స్‌ ఉంటంది. దానిని మల విసర్జన స్థానంలో కరెక్ట్‌గా అమర్చుకుని వెళ్తారు. ఈ వ్యర్థాలను ఆస్ట్రోనాట్స్‌ భూమి మీదకు తిరిగి వచ్చే సమయంలో తీసుకువస్తారు. ఎందుకంటే అక్కడే వదిలేస్తే వ్యర్థాలు పెరిగిపోతయాయి. గతంలో ఇలాగే వదిలేసేవారు. కానీ ఇప్పుడు భూమిపైకి తెచ్చి పడేస్తున్నారు.

    స్నానం ఎలా చేస్తారో తెలుసా..
    ఇక ఆస్ట్రోనాట్స్‌ స్నానం కూడా చేస్తారు. నీళ్లు పైకి వెళ్తున్న ప్రదేశంలో స్నానం చేయడం చాలా కష్టం. అందుకే వారు ముందుగా షాంపును శరీరానికి రాసుకుంటారు. తర్వాత ప్రత్యేకంగా అమర్చిన బ్యాగులాంటి ప్రదేశంలో కూర్చొని తడిపిన గుడ్డతో శరీరాన్ని తుడుచుకుంటారు. ఇలా ఆస్ట్రోనాట్స్‌ తమ స్నానం కానిచ్చేస్తారు.

    ఇక భోజనం ఎలా..
    ఆస్ట్రోనాట్స్‌ అతరిక్షంలో అన్నీ తింటారు. కానీ తినడమే కష్టం. గుడ్లు, మాంసం, బ్రెడ్‌ ఇలా అన్నిరకాల ఆహారం తీసుకుంటారు. నీళ్లు తాగుతారు. కానీ ఇందుకోసం కూడా ప్రత్యక ఏర్పాట్లు ఉంటాయి. ఆహారం తినేటప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఫుడ్‌ తీసుకుంటారు. ఇది అమెరికాలోనే తయారు చేస్తారు. దానినే తింటారు. ఇంకో విషయం ఏమిటంటే అంతరిక్షంలో ఆహారం చాలాకాలం నిల్వ ఉంటుంది.

    తర్వాత విధుల్లోకి..
    ఇక ఉదయం పనులు పూర్తయ్యాక ఆస్ట్రోనాట్స్‌ భూమిమీద ఉన్న శాస్త్రవేత్తలతో ప్రత్యేకమైన ల్యాప్‌టాప్‌తో అనుసంధానం అవుతారు. అక్కడి పరిస్థితులను వివరిస్తూ.. వారి సూచనల మేరకు పనులు చేస్తుంటారు. అవసరమేతైనే స్పేస్‌ స్టేషన్‌ బయటకు వస్తారు. వచ్చే టప్పుడు ప్రత్యేక సూట్‌ ధరిస్తారు. స్పేస్‌ స్టేషన్‌లో ఈ సూట్‌ అవసరం లేదు.

    ఎర్త్‌టైంనే ఫాలో అవుతారు..
    ఇక ఆస్ట్రోనాట్స్‌ అంతరిక్షంలో కూడా భూమిమీద ఉన్నట్లు 24 గంటల సమయాన్నే వాడతారు. కానీ అక్కడ ప్రత్యేకమైన వాచ్‌లు వాడతారు. ఇవి భూమిమీదలాగానే అంతరిక్షంలో పనిచేస్తుంది. ఇక స్పేస్‌ స్టేషన్‌ ప్రయాణ వేగం కారణంగా ఆస్ట్రోనాట్స్‌ 24 గంటల్లోనే 16 సార్లు సూర్యున్ని చూస్తారు.

    స్లీపింగ్‌ పాట్స్‌లో నిద్ర..
    ఇక విధులు ముగించుకున్న తర్వాత రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య స్పేష్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్లీపింగ్‌ పాట్స్‌లో పడుకుంటారు. ఈ పాట్స్‌ ప్రత్యేకంగా ఉంటాయి. అందులో ఆస్ట్రోనాట్స్‌ ప్రశాంతంగా నిద్రపోతారు. వారి పర్సనల్‌ వస్తువులను కూడా అందులోనే పెట్టుకుంటారు. వెంటిలేషన్‌ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇక వారు ఎలా పడుకుంటారన్నది మాత్రం వారికి కూడా తెలియదు. ఎందుకంటే గాలిలో తేలుతుంటారు కాబట్టి ఎలా పడుకున్నారు అనేది చూసేవారికి మాత్రమే తెలుస్తుంది.

    సూట్‌ తయారీకి రూ.80 కోట్లు
    ఇవన్నీ చదివితే మనం కూడా ఓసాకి వెళ్లొస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కానీ అక్కడకు వెళ్లడానికి భారీగా ఖర్చు అవుతుంది. ఆస్ట్రోనాట్స్‌ ధరించే సూట్‌ ఖరీదే రూ.80 కోట్లు ఉంటుంది. భారీగా డబ్బులు ఉన్నవారే మొదట అక్కడకు వెళ్లే అవకాశం ఉంటుంది.