Successful Director : రాజమౌళి కాదు… ఇంతవరకు అపజయం ఎరుగడు? ఆ దర్శకుడు ఎవరో తెలుసా?

అయితే రాజమౌళికి మరొక దర్శకుడు పోటీ ఇస్తున్నారు. ఆయనే రాజ్ కుమార్ హిరానీ. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ కొట్టిన రాజ్ కుమార్ హిరానీ దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరు. ఆయన చేసిన సినిమాలు ఏంటో చూద్దాం...

Written By: NARESH, Updated On : July 13, 2023 8:41 pm
Follow us on

Successful Director : దర్శకధీరుడు రాజమౌళికి అపజయమెరుగని దర్శకుడిగా పేరుంది. గతంలో ఆ ట్యాగ్ దర్శకుడు శంకర్ కి ఉండేది. జెంటిల్ మెన్ నుండి రోబో వరకు ఆయన జైత్ర యాత్ర సాగింది. స్నేహితుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి ప్లాప్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఐ కూడా ప్లాప్ అయ్యింది. రాజమౌళి మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ నుండి ఆర్ ఆర్ ఆర్ వరకు అపజయమనేది లేకుండా ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. అయితే రాజమౌళికి మరొక దర్శకుడు పోటీ ఇస్తున్నారు. ఆయనే రాజ్ కుమార్ హిరానీ. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ కొట్టిన రాజ్ కుమార్ హిరానీ దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరు. ఆయన చేసిన సినిమాలు ఏంటో చూద్దాం…

మున్నా భాయ్ MBBS

2003లో విడుదలైన మున్నాభాయ్ ఎంబీబీఎస్ దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ మొదటి చిత్రం. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 36 కోట్ల వసూళ్లు రాబట్టింది. వైద్యం కంటే మానవత్వం, ప్రేమ గొప్పదనే అంశాల ఆధారంగా తెరకెక్కింది.

లగే రహో మున్నా భాయ్

‘మున్నా భాయ్ MBBS కి కొనసాగింపుగా రాజ్‌కుమార్ హిరానీ ‘లగే రహో మున్నాభాయ్’తెరకెక్కించారు. 2006లో విడుదలైన లగేరహో మున్నాభాయ్ భారీ విజయం అందుకుంది. రూ. 19 కోట్ల ఖర్చుతో రూపొందిస్తే రూ. 126 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.

3 ఇడియట్స్

2009లో విడుదలైన 3 ఇడియట్స్ రాజ్‌కుమార్ హిరానీ ఫేమ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, కరీనా కపూర్, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలు చేశారు. రూ. 400 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ నవల ఆధారంగా తెరకెక్కిన 3 ఇడియట్స్ ఎడ్యుకేషన్ సిస్టం మీద సెటైర్.

PK

హీరో అమీర్ ఖాన్ తో దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చేసిన మరో వండర్ ‘పీకే’. 2014లో విడుదలైన ఈ మూవీ బాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. అనుష్క శర్మ హీరోయిన్ కాగా… సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, బోమన్ ఇరానీ, సౌరభ్ శుక్లా కీలక రోల్స్ చేశారు. రూ.122 కోట్లతో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.616 కోట్లు రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సంజు

హీరో సంజయ్ దత్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం సంజు. రన్బీర్ కపూర్ హీరోగా నటించారు. కేవలం రూ. 96 కోట్లతో రూపొందిన సంజు ప్రపంచవ్యాప్తంగా రూ.578 కోట్లు వసూలు చేసింది. నెక్స్ట్ రాజ్ కుమార్ హిరానీ షారుక్ ఖాన్ హీరోగా డంకీ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు.