Venu Sriram – Dil Raju: ‘దర్శకుడు వేణు శ్రీరామ్’.. ‘నిర్మాత దిల్ రాజు’ మనిషి అని ఇండస్ట్రీలో బాగా పేరు ఉంది. అయితే, ఇప్పుడు ‘వేణు శ్రీరామ్’ దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటికి వచ్చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మించిన ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన వేణు శ్రీరామ్, ‘ఓ మై ఫ్రెండ్’ అనే సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, అతనికి ఆ సినిమా తరువాత మరో సినిమా రాలేదు.

ఒక విధంగా మొదటి సినిమా ప్లాప్ కావడంతో వేణు శ్రీరామ్ ను ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి స్థితిలో మళ్ళీ దిల్ రాజే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ నానితో ‘ఎంసిఏ’ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయినా.. వేణు శ్రీరామ్ కి మాత్రం బయట సినిమాలు రాలేదు. దాంతో దిల్ రాజు అతన్ని కూర్చోపెట్టి అల్లు అర్జున్ కోసం ఒక కథ చేయించాడు.
Also Read: Bigg Boss Akhil And Bindu Madhavi: అఖిల్ కోసం ‘చేయి కోసుకుంటా’.. అందరికీ షాకిచ్చిన బిందుమాధవి
వేణు శ్రీరామ్ తో బన్నీకి కథ కూడా చెప్పించాడు. అదే ‘ఐకాన్’ సినిమా అంటూ ఎనౌన్స్ కూడా చేశారు. కానీ బన్నీ మాత్రం ఆ ఐకాన్ ను పక్కన పెట్టి త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురంలో’, అలాగే ప్రస్తుతం సుకుమార్ తో ‘పుష్ప’ సిరీస్ సెట్ చేసుకుని వేణు శ్రీరామ్ ను వెయింటింగ్ లిస్ట్ లో పెట్టాడు. అదృష్టం బాగుండి మధ్యలో వేణు శ్రీరామ్ కు ‘వకీల్ సాబ్’ లాంటి సూపర్ హిట్ వచ్చింది. వచ్చినా అతనికి బన్నీ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

దాంతో విసిగిపోయిన వేణు శ్రీరామ్ మరో హీరోకి కథ చెప్పి ఒప్పించడానికి కసరత్తులు చేస్తున్నాడు. అయితే, దిల్ రాజు మాత్రం బన్నీ కోసం వెయిట్ చేద్దాం అంటూ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ, వేణు శ్రీరామ్ మాత్రం పారితోషికం విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు. తనకు కమర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ ఉన్నా,
‘దిల్ రాజు’ బ్యానర్ లో తనకు పారితోషికం ఎక్కువ ఇవ్వడం లేదు అని ఫీల్ అవుతున్నాడు. పైగా మరో సంవత్సరం ఎదురుచూసే బదులు, బయట రెండు సినిమాలు చేసుకోవచ్చు అనే ఐడియాతో వేణు ముందుకు పోవ్వాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. దిల్ రాజు కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేశాడు. మొత్తానికి బన్నీ వారిద్దరినీ విడగొట్టాడు.
[…] Also Read: Venu Sriram – Dil Raju: వారిద్దరి బంధం చెడింది.. బన్… […]