https://oktelugu.com/

Hanu Man : అవతార్‌ తీస్తా అంటే ట్రోల్‌ చేశారు.. తీరా చూస్తే సైకిల్‌తో కారునే గుద్దేశాడు

ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొందరు ఈ వీడియోను కొంత మంది సినిమా ప్రముఖులకు ట్యాగ్‌ చేస్తుండటం విశేషం.

Written By: NARESH, Updated On : January 13, 2024 10:20 pm
Follow us on

Hanu Man :  ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంటూ అని సునీల్‌ హీరోగా నటించిన అప్పలరాజు అనే సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాట ప్రస్తుతం సంక్రాంతి సీజనలో విడుదలయిన హను-మాన సినిమా దర్శకుడు ప్రశాంత వర్మకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి ప్రతీ విషయంలోనే అతడికి ప్రతిబంధకాలే ఎదురయ్యాయి. హను-మాన సినిమా ప్రారంభం రోజే నేను అవతార్‌ మించిన సినిమాను తీస్తే చాలామంది ప్రశాంత వర్మన ట్రోల్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ప్రశాంత వర్మన ట్యాగ్‌ చేసుకుంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. అనేక అష్టకష్టాలు పడి హను-మాన సినిమా తీస్తే థియేటర్లు దొరకనీయలేదు. పాన ఇండియా రేంజ్‌లో మార్కెటింగ్‌ చేసినా సొంత రాష్ట్రంలో అడుగడుగునా ప్రతిబంధకాలు కల్పించారు. కానీ ఎక్కడా పోగొట్టుకున్నాడో ప్రశాంత వర్మ అక్కడే వెతుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా విడుదలయిన సినిమాల్లో ఇప్పటి వరకూ తను తీసిన హను-మాన చిత్రమే విజేతగా నిలిచిదంటే అతిశయోక్తి కాదు.

హను-మాన విజయవంతమైన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఆసక్తికరంగా ఓ వీడియో కనిపించింది. అంతే కాదు ట్రెండింగ్‌లోనూ ఉంది. ఇంతకీ ఏంటంటే.. హను-మాన సినిమా ప్రమోషనలో భాగంగా ప్రశాంతవర్మ ఓ సినిమా రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా సినిమా షూటింగ్‌లో సాధకబాధకాలను పంచుకున్నారు. మీ సినిమా బడ్జెట్‌ తక్కువ. ఒకరకంగా మీ సినిమా సైకిల్‌ అనుకుంటే అది కారుతో పోటీ పడగలదా? అని ఆ సినిమా రిపోర్టర్‌ ప్రశాంత వర్మకు ప్రశ్నను సంధించారు. నేను సైకిల్‌ లాంటి వాడినే అందులో తప్పు లేదు. నాకున్న బడ్జెట్‌ పరిమితుల దృష్ట్యా నా సినిమా సైకిలే. కానీ ఆ సైకిలే రేపటి నాడు కారును ఢీకొంటుందని ప్రశాంత వర్మ ఆ రిపోర్టర్‌కు సమాధానం చెప్పాడు. దీనిని కూడా కొందరు ట్రోల్‌ చేశారు. ప్రశాంత వర్మకు పొగరన్నారు. ఇంకా చాలా మాటలన్నారు.

కట్‌ చేస్తే జనవరి 13న విడుదలయిన హను-మాన సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. పోటీగా విడుదలయిన ఓ పెద్ద హీరో సినిమాను పడుకోపెట్టింది. ఆ సినిమాను డిసి్ట్రబ్యూట్‌ చేసిన మరో పెద్ద నిర్మాత పొగరును కూడా అణచివేసింది. తక్కువ బడ్జెట్‌లో హై ఎండ్‌ క్వాలిటీతో ప్రశాంత వర్మ హను-మాన సినిమాను రూపొందించడంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషనకు సంబంధించి ప్రశాంత వర్మ గతంలో ఓ సినిమా రిపోర్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సైకిల్‌-కారు ఉదాహరణ తాలూకూ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొందరు ఈ వీడియోను కొంత మంది సినిమా ప్రముఖులకు ట్యాగ్‌ చేస్తుండటం విశేషం.