Christopher Nolan : ఓపెన్ హైమర్… సినిమా కోసం అణుబాంబు పేల్చిన క్రిస్టోఫర్ నోలన్!

క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ చిత్రంలో నిజమైన ఆటం బాంబు పేలుడు చూపించబోతున్నాడనే వాదన తెరపైకి వచ్చింది. ఈ ఊహాగానాలకు క్రిస్టోఫర్ నోలన్ సమాధానం చెప్పారు.

Written By: NARESH, Updated On : July 18, 2023 9:52 pm
Follow us on

దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు వరల్డ్ వైడ్ అభిమానులున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లర్, ది డార్క్ నైట్, ది డార్క్ నైట్ రైజెస్ చిత్రాలు వరల్డ్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తుందట సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈసారి ఆయన బయోపిక్ ఎంచుకున్నారు. ఆటం బాంబ్ సృష్టికర్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ఓపెన్ హైమర్ టైటిల్ తో మూవీ తెరకెక్కించారు. జులై 21న వరల్డ్ వైడ్ ఓపెన్ హైమర్ విడుదల కానుంది.

ఈ చిత్రంలో ఆటం బాంబును పేల్చే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. అత్యంత సహజంగా, వాస్తవికతకు దగ్గరగా ఆటం బాంబు పేలుడు చూపించేందుకు క్రిస్టోఫర్ నోలన్ రియల్ ఆటం బాంబు ఎడారి ప్రాంతంలో పేల్చారని, ఆ దృశ్యాలు కెమెరాలో బంధించారంటూ ప్రచారం జరుగుతుంది. గతంలో క్రిస్టోఫర్ నోలన్ ది బ్యాట్ మాన్ బిగిన్స్ చిత్రం కోసం ఒక బిల్డింగ్ పేల్చేశారు. ది డార్క్ నైట్ రైజెస్ మూవీలో విమానం గాల్లో బద్దలయ్యే సన్నివేశం ఉంటుంది. దాన్ని కూడా ఆయన గ్రాఫిక్స్ లో చేయకుండా నిజంగా చేసి షూట్ చేశారు.

ఈ క్రమంలో క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ చిత్రంలో నిజమైన ఆటం బాంబు పేలుడు చూపించబోతున్నాడనే వాదన తెరపైకి వచ్చింది. ఈ ఊహాగానాలకు క్రిస్టోఫర్ నోలన్ సమాధానం చెప్పారు. అందులో నిజం లేదన్నారు. నేను సినిమా కోసం ఎంతకైనా తెగిస్తాను అనే ఓ నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అది ఒకింత భయపెడుతుంది. నేను ఆటం బాంబు విస్ఫోటనానికి పాల్పడలేదన్నారు.

అలా అని గ్రాఫిక్స్ లో కూడా ఆ సన్నివేశం చేయలేదన్నారు. సీజీ లో అణు బాంబు పేలుడు రూపొందించడం చాలా సులభం. అయితే అణు బాంబు పేలితే కలిగే విధ్వంసం సహజంగా, ప్రేక్షకులు అర్థం చేసుకుని, భయపడేలా చేయలేదు. అందుకే గ్రాఫిక్స్ వదలేదన్నారు. మరి ఎలా అణు బాంబు పేలుడు సన్నివేశాలు రూపొందించారన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఓపెన్ హైమర్ మూవీలో సిల్లియన్ ముర్ఫీ ప్రధాన పాత్ర చేశారు.