Men Laws: ఆడవాళ్ల నుంచి రక్షణ కోసం మగాళ్లకు ఈ చట్టాలున్నాయని తెలుసా?

కొంతమంది అమ్మాయిలు, మహిళలు అకారణంగా మగవారిపై చేయి చేసుకుంటారు. కారణం చెప్పకుండానే పది మందిలో కొట్టేస్తారు. పరువు తీస్తారు. ఇలాంటివి రద్దీ ప్రదేశాల్లో, బస్సులు, రైళ్లలో, కాలేజీల్లో ఎక్కువగా జరుగుతుంటాయి.

Written By: Raj Shekar, Updated On : January 6, 2024 11:50 am

Men Laws

Follow us on

Men Laws: చట్టాలు.. ప్రజల రక్షణ కోసం రాజ్యాంగంలో పాలకులు పొందుపర్చినవి. మన మాన ప్రాణాలకు, ఆస్తులకు ఆపద వచ్చినప్పుడు ఈ రక్షణ చట్టాలతో మనం రక్షణ పొందవచ్చు. అయితే చాలా మందిలో చట్టాలు ఆడవాళ్లకే అనుకూలంగా ఉన్నాయన్న భావన ఉంది. వరకట్నం కేసు, వేధింపుల కేసు, అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతుండడమే ఇందుకు కారణం. ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టే కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇందులో కొన్ని ఫాల్స్‌ కేసులు కూడా ఉంటున్నాయి. మగవారిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టడం, కొట్టడం వంటివి కూడా ఇటీవల పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మగవారి రక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి. కానీ, వీటి గురించి చాలా మందికి తెలియదు. అవేంటో తెలుసుకుందాం.

అకారణంగా చేయి చేసుకుంటే..
కొంతమంది అమ్మాయిలు, మహిళలు అకారణంగా మగవారిపై చేయి చేసుకుంటారు. కారణం చెప్పకుండానే పది మందిలో కొట్టేస్తారు. పరువు తీస్తారు. ఇలాంటివి రద్దీ ప్రదేశాల్లో, బస్సులు, రైళ్లలో, కాలేజీల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అంతే కాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసి జైల్లో పెట్టించాలని చూస్తారు. ఎవరైనా మన తప్పు లేకుండా చేయి చేసుకుంటే ఐపీపీ 323 సెక్షన్‌ కింద దాడి చేసిన యువతి లేదా మహిళపై కేసు నమోదు చేయవచ్చు. అది నిరూపణ అయితే దాడిచేసిన మహిళ లేదా యువతికి ఏడాది జైలు శిక్ష పడుతుంది.

తప్పుడు కేసులు పెడితే..
ఇక ఎవరైనా మహిళ పురుషులపై తప్పుడు కేసులు పెట్టినా కూడా చట్ట ప్రకారం రక్షణ పొందవచ్చు. ఇలాంటివి ఇటీవల చాలా పెరుగుతున్నాయి. లైంగికంగా వేధించారని, మానసికంగా వేధిస్తున్నారని, టీజ్‌ చేస్తున్నాడని పోలీసులకు మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, తప్పుడు కేసు పెట్టిందని మనం భావిస్తే, తప్పుడు సాక్షాలతో ఇరికించాలని చూస్తున్నట్లు గుర్తిస్తే ఐపీసీ 192 ప్రకారం ఆ యువతి లేదా మహిళపై కేసు ఫైల్‌ చేయవచ్చు అది నిరూపితమైనే సదరు మహిళ లేదా యువతికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం ఉంది. ఇక మగవారిపై పెట్టిన కేసు ఫాల్స్‌ అని తేలితే కోర్టు దానిని కొట్టేస్తుంది కూడా.

మహిళలను గౌరవిద్దాం..
మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయం. దానిని అందరం పాటిద్దాం. కానీ, ఇటీవల కి‘లేడీ’లు పెరుగుతున్నారు. వాళ్ల ఎంజాయ్‌మెంట్‌ కోసం, లేదా కావాలని ఇరికించేందుకు మగవారిపై తప్పుడు కేసులు పెడుతున్నా. ఇలాంటివి ఇష్టంలేని పెళ్లిళ్ల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి వారి నుంచి రక్షణ కోసమే పురుషులకు కల్పించిన చట్టాలను వినియోగించుకోవాలి.