Somu Veeraju: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఇప్పుడందరూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన నిన్న విజయవాడ ప్రజాసభలో చేసిన డైలాగులకు పార్టీలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పేరిట దోచుకుంటోందని.. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12వేలు రాబట్టి వాటినే వారి అకౌంట్లో వేస్తోందన్నారు. ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే రూ.50 కే చీప్ లిక్కర్ ఇస్తామని ప్రకటించారు. పాపం సోము వీర్రాజు వ్యాఖ్యలను మాత్రమే టార్గెట్ చేస్తున్న వారికి.. ఆయన సృశించిన మరో కోణాన్ని మాత్రం ఎవరూ చూడడం లేదు. విమర్శకుల సంగతిని పక్కనపెడితే.. మందుబాబులు, మెజార్టీ ప్రజలు మాత్రం సోమువీర్రాజుకు సపోర్టుగా నిలుస్తుండడం విశేషం. ఇది మరో కోణం.

ఈరోజు మందు తాగని వారంటూ ఎవరూ లేరు. ఆడవాళ్లు సైతం మద్యం తాగేస్తున్న రోజులివీ.. పండుగైనా.. పబ్బమైనా.. చివరకు చావు అయినా సరే.. మద్యం లేనిదే ఆ కార్యక్రమమే లేదు. నిత్యావసరమైన మద్యం ఏపీలో కరువైంది. సరైన బ్రాండ్ మద్యం లేదు. మంచి కంపెనీల మద్యం దొరకదు. పిచ్చి మందుతో మద్యం బాబులను పిచ్చివాల్లుగా ఏపీలో మార్చేస్తున్నారు. 100 రూపాయలకు దొరికే మందును మూడు రెట్లు పెంచి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మద్యం విషయంలో ఏపీ ప్రజల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఉంది.
ఏపీ జనాభాలో దాదాపు కోటి మంది వరకూ మద్యం తాగే వారున్నారు. అంతమంది ఓటేస్తే నిజంగానే ఏపీలో అధికారం తథ్యం. ఓటు వేసేటప్పుడు మందుబాబుల ఆగ్రహాన్ని అవకాశంగా మలుచుకుంటే మాత్రం నిజంగానే సోము వీర్రాజు సక్సెస్ అవుతారు. అందుకే మందుబాబుల ఆవేదనను సోము వీర్రాజు అర్థం చేసుకున్నారని వారు అంటున్నారు.
సోము వీర్రాజు ఏపీలో బర్నింగ్ ఇష్యూ అయిన మద్యం బాధలను స్టడీ చేసినట్టున్నాడు. మద్యం షాపుల వద్ద మద్యం అధిక ధరలకు కొంటూ ఏపీ సర్కార్ ను తిడుతున్న వారి సంఖ్య కోకొల్లలుగా ఉంది. తెలంగాణలో సగానికి దొరికే మందు.. ఏపీలో డబుల్, త్రిబుల్.. అది నాసిరకం మందు లభించడంపై ఏపీ ప్రజల్లోనూ ఆగ్రహ జ్వాలలున్నాయి. మందుబాబులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని.. వారి కష్టాలను తీర్చాలని సోము వీర్రాజు డిసైడ్ అయ్యారు. అందుకే చీప్ లిక్కర్ ను రూ.50కే తెస్తానని హామీ ఇచ్చారు. ఎవరేమనుకున్నా సరే.. ట్రోలింగ్ జరిగినా సరే.. ఏపీలో విపరీతంగా పెరిగిపోయిన మద్యం ధరల విషయంలో సోము వీర్రాజు తీసుకున్న స్టాండ్ ను మెజార్టీ ప్రజలు సపోర్టు చేస్తుండడం విశేషం.
మద్యం విషయంలో వెనక్కి తగ్గకుండా మేనిఫెస్టోలోనూ పెడితే మందుబాబుల కరుణ బీజేపీపై ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోవలోనే వారి కుటుంబ సభ్యుల ఓట్లు పడవచ్చు. బీజేపీ, సోము వీర్రాజు టీం లెక్కలేసుకొనే ఈ మద్యం ఇష్యూను తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.