Bigg Boss 6 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎవ్వరి అంచనాలకు అందకుండా ముందుకు సాగుతోంది. టీఆర్పీ రేటింగ్స్ మాత్రం గురించి ఈ మాట అనడం లేదు.. బిగ్ బాస్ ఇస్తున్న షాకులు గురించి మాట్లాడుతున్నాం!.. బిగ్ బాస్ షో ప్రారంభంలో ఎవరో ఒకరిద్దరు కంటెస్టెంట్స్ మినహా మిగిలిన ఇంటి సభ్యులు ఎవ్వరూ కూడా సరిగా ఆడేవారు కాదు..ఆ తర్వాత నాగార్జున , బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో బాగా ఫైర్ రగిలించడం తో ఇప్పుడు అందరూ బాగా ఆడుతున్నారు.

కానీ అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా అత్యద్భుతంగా ఆడుతున్న కంటెస్టెంట్స్ అర్జున్ కళ్యాణ్ , ఆరోహి ఇప్పుడు లేటెస్ట్ గా సూర్య ఎలిమినేట్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.. షాకింగ్ విషయం ఏమిటి అంటే..అర్జున్ కళ్యాణ్ ఆటని సరిగా ఆడనంత కాలం నామినేషన్స్ నుండి సేవ్ అవుతూ వచ్చాడు.. ఎప్పుడైతే అతను టాస్కులు సీరియస్ గా తీసుకొని ఆడడం మొదలు పెట్టాడో..అప్పుడు ఎలిమినేట్ అయ్యాడు..ఇది చూసే ప్రేక్షకులకు ఏ మాత్రం న్యాయం గా అనిపించలేదు.
ఇక సూర్య అయితే మొదటి నుండి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో కానీ..టాస్కులు ఆడడం లో కానీ ఎంతోమంది కంటెస్టెంట్స్ కంటే ఎంతో బెటర్..కానీ అతను కూడా ఎలిమినేట్ అవ్వడం చూసే ప్రేక్షకులకు న్యాయంగా అనిపించలేదు..అయితే వీళ్ళని ఎలిమినేట్ చెయ్యడానికి కూడా ఒక కారణం ఉంది.. అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ షో మీద ప్రస్తుతం హైకోర్టు లో కేసు నడుస్తోంది..యువతని తప్పుదోవ పట్టించేలా ఈ షో ఉందంటూ హైకోర్టు లో చాలా కాలం క్రితమే కేసు నమోదు అయ్యింది..అయితే ఇటీవలే విచారణ కి వచ్చిన ఈ కేసు పై కౌంటర్ దాఖలు చేయాలంటూ నాగార్జునకి , బిగ్ బాస్ యాజమాన్యంకి హైకోర్టు నోటీసులు పంపింది.. రెండు వారాల్లోపు కౌంటర్ దాఖలు పూర్తి చేయాలని.. ఈ రెండు వారాల్లో బిగ్ బాస్ కి సంబంధించిన మూడు ఎపిసోడ్స్ కూడా చూస్తామని.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో హౌస్ లో లవ్ ట్రాక్స్ నడపడానికి ప్రయత్నిస్తున్న అర్జున్ – సూర్యలను ఎలిమినేట్ చేసారని తెలుస్తోంది.. అర్జున్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండే శ్రీ సత్యని వన్ సైడ్ లవ్ చేస్తూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే.. మరోవైపు సూర్య ఒకరితో కాదు..కీర్తి, ఇనాయ, ఆరోహి ఇలా వరుసగా ఇంట్లో వల్ల ఆడవాళ్లను హాగ్ చేసుకోవడం కిస్ చేసుకోవడం వంటివి చేస్తున్నాడు.. ఇలాంటివి హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తే డేంజర్ కనుక ఈ ఇద్దరి ఇంటి సభ్యులను ఉద్దేశపూర్వకంగానే ఎలిమినేట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.