Gautam Gambhir: ఇండియన్ క్రికెట్ టీమ్ లో చాలామంది ప్లేయర్లు వాళ్ళ సామర్థ్యం మేరకు వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తూ తమదైన రీతిలో మ్యాచ్ లను ఆడుతూ టీం కి చాలా గొప్ప సేవలను అందించారు. ముఖ్యంగా 2011 వ సంవత్సరంలో ఇండియన్ టీం కి వరల్డ్ కప్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. 1983లో ఇండియన్ టీమ్ కి ఒకసారి వరల్డ్ కప్ రాగా, మళ్లీ రెండవసారి 2011 వ సంవత్సరంలో ఇండియన్ టీం వరల్డ్ కప్ ని అందుకుంది.
ఇక ఈ సమయంలో ఇండియన్ టీం కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని టీమ్ ని ముందుండి నడిపించాడు. అలాగే ఫైనల్ మ్యాచ్ లో కూడా 91 పరుగులు చేసి అజయంగా నిలవడమే కాకుండా చివర్లో ఫినిషింగ్ షాట్ కొట్టి ఇండియన్ టీం కి వరల్డ్ కప్ ని అందించాడు. అయితే అప్పటినుంచి ఇండియన్ టీం కి వరల్డ్ కప్ అందించింది ధోని ఒక్కడే అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ఇక దాంతో ఇప్పటికి చాలాసార్లు గౌతమ్ గంభీర్ దానిమీద ఒక క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ధోని ఒక్కడి వల్లే వరల్డ్ కప్ అనేది గెలవలేదు ప్లేయర్లందరు సమిష్టిగా రాణిస్తేనే వరల్డ్ కప్ అనేది వచ్చింది అంటూ తనదైన రీతిలో అవకాశం వచ్చిన ప్రతిసారి ఈ విషయం మీద మాట్లాడుతూ ఉంటాడు.
అయితే ఇప్పుడు రీసెంట్ గా ANI ఫోడ్ కాస్ట్ లో స్మిత తో మాట్లాడుతూ ఆయన ఓసారి వరల్డ్ కప్ ప్రస్తావన తీసుకువచ్చారు. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం కి అసలైన హీరో యువరాజ్ సింగ్ కానీ ఆయన ఎవరికి గుర్తుండడు కానీ ధోని ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకుంటారు.ఇక యువరాజ్ సింగ్ ఆ వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నితించాడు అంటే ఆయన ఆడిన ఆటతీరు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక 2011 వ సంవత్సరంలో ఆడిన వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి 15 వికెట్లు తీశాడు.అలాగే నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. కానీ ఆయన ఎవరికీ గుర్తుకు రావడం లేదు వరల్డ్ కప్ అంటే కొంతమంది మాత్రమే గుర్తుకొస్తున్నారు. యువరాజ్ సింగ్ కి పిఆర్ టీమ్ పెద్దగా పనిచేయలేదేమో అందుకే ఆయన ఎవరికి గుర్తు ఉండటం లేదు.అయితే ఒకరి పేరే పదేపదే చెప్తుంటే జనాల్లో ఆ పేరు మాత్రమే ఎక్కువగా గుర్తుండిపోతుంది. అందుకే యువరాజ్ సింగ్ పేరుని అందరూ మర్చిపోయారు గంభీర్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు…