#Dacoit Title Teaser : అడివి శేష్ స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. అందుకే వరుస విజయాలు అందుకుంటున్నాడు. అడవి శేష్ నటించిన ఎవరు?, మేజర్, హిట్ 2 చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన గూఢచారి 2 చేస్తున్నారు. గూఢచారి 2 సెట్స్ పై ఉండగానే మరో మూవీ ప్రకటించారు. అడివి శేషుకి జంటగా శృతి హాసన్ నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. నేడు టైటిల్ టీజర్ విడుదల చేశారు .
జస్ట్ కాన్సెప్ట్ టీజర్ కోసం భారీగా ఖర్చు చేశారు. పెద్ద సెటప్ ఏర్పాటు చేశాడు. కాలి బూడిద అవుతున్న ప్రదేశంలో పదుల సంఖ్యలో చచ్చి పడి ఉన్న పోలీసులు. ఆ శవాల మధ్య లో శృతి హాసన్, అడివి శేష్ మధ్య ఆసక్తికరమైన డైలాగ్ వార్. శృతి కళ్ళల్లో శేషును చంపేయాలన్నంత కోపం, కసి. వారి డైలాగ్ వార్ ని బట్టి చూస్తే… శృతి ఒకప్పటి శేషు లవర్. అతడు మోసం చేయడంతో విడిపోతుంది. చాలా ఏళ్ల తర్వాత ఒక యుద్ధ వాతావరణంలో ఎదురు పడ్డారు.
టీజర్ చివర్లో ఒకరినొకరు కాల్చుకున్నట్లు చూపించారు. అడివి శేష్ రోల్ లో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఇక టైటిల్ గా డెకాయిట్ అని రివీల్ చేశారు. డెకాయిట్ అంటే బందిపోటు. దారి దోపిడీలు చేసే దొంగ అని అర్థం. డెకాయిట్ ట్యాగ్ లైన్ మాత్రం ఒక ప్రేమకథ అని పెట్టారు. ఇది ఆసక్తి రేపే అంశం. శేషు, శృతి హాసన్ క్యారెక్టర్స్ చాలా ఇంటెన్స్ తో కూడుకుని ఉన్నాయి.
డెకాయిట్ మూవీ కథ ఏమిటీ? శృతి, శేషు పాత్రల నేపథ్యం ఏమిటనేది ఆసక్తికర అంశం. త్వరలో హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ మొదలు కానుందట. డెకాయిట్ చిత్రానికి షానీల్ డియో దర్శకుడు. రచనలో శేషు హస్తం కూడా ఉంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. మొత్తంగా టైటిల్ టీజర్ అదిరింది.