
World Cup 2023 : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు నుంచి నవంబరు వరకు భారత్ వేదికగా ఈ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. సుమారు 12 ఏళ్ళ తరువాత భారత్ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. చివరి సారిగా భారత్ లో నిర్వహించిన వన్డే కప్ భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
క్రికెట్ ను పిచ్చిగా ప్రేమించే భారత్ లో ఈ ఏడాది క్రికెట్ పండగ నడవనుంది. ఇప్పటికే మహిళల ఐపీఎల్ ముగియగా, ఈ నెల 31 నుంచి పురుషుల ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఐపీఎల్ తరువాత పలు దేశాలతో కీలక దేశాలతో వన్డే, టీ20 మ్యాచ్లు భారత్ ఆడనుంది. అనంతరం అక్టోబరు నుంచి నవంబరు మధ్య మరో ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహణకు భారత్ సిద్ధం అవుతోంది. వన్డే వరల్డ్ కప్ ను భారత్ నిర్వహించనుంది. ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా గత వారం దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో ఈ వివరాలను ఐసీసీకి అందించినట్లు సమాచారం. దీని ప్రకారం అక్టోబర్ ఐదు నుంచి ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.
11 నగరాల్లో.. మ్యాచ్ లు నిర్వహణ..
క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. వరల్డ్ కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులకు పోటీపడుతుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ మ్యాచ్లో నిర్వహణ విషయంలో బిసి సే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మ్యాచ్లు నిర్వహించడం ద్వారా ఆయా ప్రాంతాల అభిమానులు ప్రత్యక్షంగా వరల్డ్ కప్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం మ్యాచ్లు నిర్వహించేందుకు 11 నగరాలను బీసీసీ ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు తెలిసింది.
అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్..
వరల్డ్ కప్ మ్యాచ్ అన్నీ ఒక ఎత్తు అయితే.. ఫైనల్ మ్యాచ్ ఒకటి ఒక ఎత్తు. ఫైనల్ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ నవంబర్ 19న అహ్మదాబాద్లో ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించింది.
46 రోజులు.. 48 మ్యాచ్లు
భారత్లో నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్ ను 46 రోజులపాటు నిర్వహించనున్నారు. ఫైనల్ తో పాటు మొత్తం 48 మ్యాచులు ఉంటాయి. 10 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. వేదికల విషయంలో అహ్మదాబాద్ కాకుండా మరో పదకొండు నగరాలను బీసీసీ ప్రాథమికంగా షార్ట్ లిస్ట్ చేసింది.
హైదరాబాదులో కొన్ని మ్యాచ్ లు..
వన్డే వరల్డ్ కు సంబంధించిన కొన్ని మ్యాచ్లు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన జాబితాలో హైదరాబాద్ కూడా ఉంది. మ్యాచ్లు నిర్వహించే నగరాలను పరిశీలిస్తే.. ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్ ఈ జాబితాలో ఉన్నాయి.
వాతావరణ పరిస్థితులను బట్టి..
వన్డే వరల్డ్ కప్పు కోసం బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన నగరాల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ నెలలో వరల్డ్ కప్పు జరుగుతున్న నేపథ్యంలో, అప్పటి వాతావరణ పరిస్థితులను దృష్ట్యా వేదికల్లో మార్పు ఉండే అవకాశం ఉంది.
భారత్ లో అప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్లు, వాటి వేదికల వివరాలకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉంది. అయితే త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తామని ఐసిసికి బీసీసీఐ బోర్డు సమాచారం ఇచ్చింది. అలాగే, పాకిస్తాన్ జట్టుకు వీసా మంజూరు, భారత ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ అందించడం వంటి అంశాల పైన కూడా బీసీసీఐ మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 2011లో చివరిసారిగా భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి మన జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.