Credit Card: క్రెడిట్ కార్డు తీసుకోవడం.. వాడడం.. లాభమా? నష్టమా?

వినియోగదారుల ట్రాన్షాక్షన్ భట్టి కొన్ని బ్యాంకులు వినియోగదారులకు ముందుగా తక్కువ లిమిట్ తో క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు సైతం బ్యాంకుల సహాయంతో క్రెడిట్ కార్డులను మినిమం ధ్రువపత్రాల ఆధారంగా జారీ చేస్తున్నాయి.

Written By: Srinivas, Updated On : September 26, 2023 10:11 am

Credit Card

Follow us on

Credit Card: నేటి కాలంలో ప్రతీ కుటుంబం జీవితాన్ని కొనసాగించడం కాదు.. జీవితంతో పోరాడుతోంది..అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచీకరణలో భాగంగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ అందుకు తగిన ఆదాయం మాత్రం రావడం లేదు. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా ఆశించిన ఆదాయం రాకపోవడంతో చాలా మంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు ఇతరుల వద్ద ఎంతో కొంత వడ్డీ చెల్లించి అప్పు తీసుకునేవారు. కానీ ఇప్పుుడు అప్పులు ఎవరూ ఇవ్వడం లేదు. పైగా వడ్డీ భాగా విధిస్తున్నారు. దీంతో బ్యాంకులు క్రెడిట్ కార్డుల రూపంలో వినియోగదారులకు అవసరం మేర రుణాలు ఇస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డుల ద్వారా రుణం తీసుకోవడం లాభమా?నష్టమా? అనేది తెలుసుకుందాం.

వినియోగదారుల ట్రాన్షాక్షన్ భట్టి కొన్ని బ్యాంకులు వినియోగదారులకు ముందుగా తక్కువ లిమిట్ తో క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు సైతం బ్యాంకుల సహాయంతో క్రెడిట్ కార్డులను మినిమం ధ్రువపత్రాల ఆధారంగా జారీ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డులో ఇచ్చిన లిమిట్ తో నెల వరకు నిత్యావసర ఖర్చుల కోసం వాడుకోవచ్చు. కానీ గడువు తేదీన కచ్చితంగా పే చేయాలి. లేకుంటే భారీ వడ్డీ విధిస్తుంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డులను ముందుగా వినియోగించి ఆ తరువాత బిల్లు చెల్లించే సమయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ ను బ్లాక్ చేసి ఆ మొత్తాన్ని రుణ రూపంలో అందిస్తున్నాయి. వీటికి తక్కువ వడ్డీ విధిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే అప్పులపై వడ్డీ కన్నా.. ఈ వడ్డీ తక్కువగా ఉండడంతో చాలా మంది క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ రుణం నెలనెలా చెల్లించే వీలుబాటు ఉండడంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఆర్ బీఐ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వ్యక్తి క్రెడిట్ కార్డుపై కనీసం రూ.16000 వరకు వాడుతున్నారని పేర్కొంది. అయితే క్రెడిట్ కార్డులపై లోనం తీసుకునేటప్పుడు ఉన్న సంతోషం గడువు తేదీ వచ్చేసరికి పట్టించుకోవడం లేదు. గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే బ్యాంకులు 36 శాతం వరకువడ్డీ విధిస్తున్న విషయం గ్రహించడం లేదు.

అసలు క్రెడిట్ కార్డులు ఎవరు తీసుకోవాలి? ఇది తీసుకోవడం వల్ల లాభమా? నష్టమా? అని పరిశీలిస్తే.. అవసరం ఉన్న వారికి క్రెడిట్ కార్డు ఎంతో లాభం. అయితే క్రెడిట్ కార్డును ఎంతో జాగ్రత్తగా వాడుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది.ముఖ్యంగా క్రెడిట్ కార్డును వాడేటప్పుడు ఆ బిల్లును మనం చెల్లించగలమా? అనేది నిర్ణయించుకోవాలి. వ్యక్తికి వచ్చే జీతంలో 30 శాతం ఈఎంఐ చెల్లించే విధంగా రుణం తీసుకోవాలి. ఇలా ప్రణాళిక ప్రకారం క్రెడిట్ కార్డు వాడితో లాభం. కానీ గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే తీసుకున్న రుణంపై వడ్డీ భారం పడడమే కాకుండి సిబిల్ స్కోర్ తక్కువై ఆ తరువాత ఇచ్చే రుణాలకు అనర్హులుగా మారుతారు.