INDIA alliance : ఇండియా కూటమిలో అప్పుడే చీలికలు వచ్చాయి. మొదలైందో లేదో అప్పుడే బీటలు వారుతోంది. బెంగాల్ లోని రాష్ట్ర సీపీఎం నాయకత్వం ఈ అసమ్మతికి తెరతీసింది. మా క్యాడర్ ను చంపేసి.. మమ్మల్ని వెళ్లగొట్టినవాళ్లు టీఎంసీ పార్టీ అయితే.. మేం వాళ్లతో కలవము.. కలిసేది లేదని బెంగాల్ సీపీఎం నేతలు తెగేసి చెప్పారు.
ఇటీవల బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో కూడా టీఎంసీ కార్యకర్తలు సీపీఎం నాయకులను హత్య చేశారు. చాలా మందిని టీఎంసీ నేతలు చావబాదారు. సో మేం ఇండియా కూటమిలో టీఎంసీతో కలిసి పనిచేయమని బెంగాల్ సీపీఎం నేతలు అసమ్మతి రాజేశారు.
మమతా బెనర్జీతో ఒక స్టేజీ మీద కూర్చోవడానికే మా క్యాడర్ డైజెస్ట్ చేసుకోవడం లేదని సీపీఎం నేతలు తెగేసి చెబుతున్నారు. ఒకవేళ కలిసినా మేం చెప్పినా సీపీఎం క్యాడర్ ఎట్టి పరిస్థితుల్లో టీఎంసీకి ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. సీపీఎం వాళ్లు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
మమతాతో కలిసేదే లేదని తెగేసి చెప్పిన సిపిఎం, కాంగ్రెస్ స్థానిక నాయకత్వంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..