https://oktelugu.com/

Corona: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. డేంజర్ జోన్ లో ఆ రాష్ట్రం

తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో నలుగురికి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కేరళలో 292 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 20, 2023 / 12:12 PM IST

    Corona

    Follow us on

    Corona: దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. మరోసారి విశ్వరూపం చూపిస్తోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 341 మంది కరోనా బారిన పడ్డారు. కేరళలో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈనెల 8న కేరళలో తొలి కేసు నమోదు అయ్యింది. అక్కడ నుంచి దేశవ్యాప్తంగా క్రమేపి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కేరళలో కరోనాతో ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

    తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో నలుగురికి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కేరళలో 292 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. తమిళనాడులో 13, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 9, పుదుచ్చేరిలో 4 కేసులు నమోదయ్యాయని.. మిగతా రాష్ట్రాల్లో పది వరకు కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

    2020లో కరోనా వ్యాప్తి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2021లో సైతం విశ్వరూపం చూపించింది. దేశవ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. అటు తరువాత క్రమేపి కేసుల సంఖ్య తగ్గాయి. వ్యాక్సినేషన్ సక్రమంగా జరగడంతో సాధారణ పరిస్థితి వచ్చింది. రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు కేసులు ప్రారంభమవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. కొన్ని మార్గదర్శకాలను సూచించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వాలతో అత్యవసర భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. కేసులు ముదిరితే మాత్రం మరోసారి ఆంక్షలు విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.