https://oktelugu.com/

CM KCR: కేసీఆర్‌ సభలో కాంగ్రెస్‌ పాట.. కేసీఆర్ సీరియస్.. వైరల్ వీడియో

తాజాగా కేసీఆర్‌ సభలోనే రేవంత్‌ పాట మార్మోగింది. జైజై రేవంత్‌ అంటూ జయభేరి మోగెరో.. జన జాతర సాగెరో అనే పాట మార్మోగింది. సభకు సమీపంలోనే కాంగ్రెస్‌ ప్రచార వాహనం వచ్చింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2023 / 10:42 AM IST

    CM KCR

    Follow us on

    CM KCR: తెలంగాణ ఎన్నికల ప్రజారాన్ని హోరెత్తిస్తున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ఈసారి గెలిచి చరిత్రను తిరగ రాయాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ, అరిపోయిన రికార్డు తరహాలో మూసధోరణిలో సాగుతున్న ప్రసంగం చూసి ప్రజలు కష్టంగా కేసీఆర్‌ సభలకు వస్తున్నారు. కూలీ తీసుకుంటున్నాం కాబట్టి రావాలి అన్నట్లుగా వస్తున్నారు. కొన్ని సభల్లో అయితే కేసీఆర్‌ కంటే ముందే.. ఆయన ఏం వట్లాడతారో.. ఎవరిని ఏమంటారో.. చెప్పేస్తున్నారు. అంతలా కేసీఆర్‌ ప్రసంగం మూసధోరణిలో సాగుతోంది. అయితే గులాబీ బాస్‌ ప్రసగంలో కొన్ని కొన్ని కాంగ్రెస్‌ నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి స్పందన లేకపోవడం, సభలో కాంగ్రెస్‌ నినాదాలు వినిపస్తుండడం, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న మౌత్‌ ప్రచారంతో గులాబీ బాస్‌లో అసహనం పెరుగుతోంది. దీంతో తిట్ల దండకం కూడా అందుకుంటున్నారు.

    సభ సమీపంలో రేవంత్‌ పాట..
    తాజాగా కేసీఆర్‌ సభలోనే రేవంత్‌ పాట మార్మోగింది. జైజై రేవంత్‌ అంటూ జయభేరి మోగెరో.. జన జాతర సాగెరో అనే పాట మార్మోగింది. సభకు సమీపంలోనే కాంగ్రెస్‌ ప్రచార వాహనం వచ్చింది. అదే సమయంలో కేసీఆర్‌ మాట్లాడేందుకు వేదికపైకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ పాట మార్మోగింది. దీంతో సభకు వచ్చిన వారు కూడా ఎంజాయ్‌ చేశారు. ఇది విన్న సీఎం తన ప్రసంగం కాసేపు ఆపారు. అయినా వాహనం వెళ్లిపోకపోవడంతో ‘అక్కడొకరు. అక్కడొకరు ఉంటరు.. కిరికిరిగాళ్లు ఉండగా..’ అన్నారు. అంతేకాదు. మన సభకాడ వాళ్లు మైక్‌ పెట్టుడేంది.. పోలీస్‌ మిత్రులు మైక్‌ బంద్‌ చేపియ్యాలె అని ఆదేశించారు. దీంతో పోలీసులు వెళ్లే సరికి మరోమారు పాట మార్మోగింది. దీంతో కేసీఆర్‌ అసహనానికి గురయ్యారు.

    తెలంగాణ అంతాటా..
    ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ పాట తెలంగాణ అంతటా మార్మోగుతోంది. ఈసారి బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థులు స్వచ్ఛందంగా, కసిగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోనూ గులాబీ పార్టీపై వ్యతిరేకత ఉంది. తొమ్మిదేళ్ల పాలనతో విసిగిపోయారు. దీంతో ఈసారి కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని భావిస్తున్నారు. సర్వేలు కూడా కాంగ్రెస్‌ లేదా హంగ్‌ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఎలాగైనా గెలవాలని బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను గద్దె దించాలని కాంగ్రెస్‌ పనిచేస్తున్నాయి. ఈ హోరాహోరీ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.