https://oktelugu.com/

Congress Seniors : గెలవని సీట్లు ఎందుకయ్యా మీకు.. ఇంట ఓడి.. రచ్చకు కాంగ్రెస్ సీనియర్లు

ఇలా కాంగ్రెస్ తమవి కాని సీట్లలో పోటీచేస్తున్నారు. తమ సొంత స్థానాలను వదిలి చాలా మంది నాన్ లోకల్ సీట్లలో పోటీకి దిగారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2023 / 10:07 PM IST
    Follow us on

    Congress Seniors : కాంగ్రెస్ సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. తమవి కాని చోట గెలిచేందుకు వెళుతున్నారు. నాన్ లోకల్స్ గా బరిలోకి దిగుతున్నారు. అదే వారి పాలిట శాపమవుతోంది. వారి ఓటమికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి..

    తాజాగా విడుదలైన కాంగ్రెస్ 2వ లిస్ట్ చూస్తే.. సీనియర్లు అందరికీ వారు కోరుకున్న చోటనే టిక్కెట్లను కాంగ్రెస్ ఇచ్చింది. అయితే వారు లోకల్ కాని సీట్లనే వారికి ఇవ్వడం నిజంగా కాంగ్రెస్ కు మైనస్ గా చెప్పొచ్చు. ఎల్.బీ నగర్‌ నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ కు కేటాయించారు.నిజానికి ఈయనది నిజామాబాద్. అక్కడ ఎంపీగా గెలిచాడు. కానీ అక్కడ వరుసగా ఎన్నికల్లో ఓటములతో ఎల్బీనగర్ కు మకాం మార్చారు. ఇక్కడ నాన్ లోకల్ మధుయాష్కీ కావడంతో ఆయనకు మైనస్ గా మారింది.

    ఇక పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. అక్కడ వరుస ఓటములతో హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌ పోటీకి దిగారు. నిజానికి హుస్నాబాద్ లో బలంగా ప్రవీణ్ రెడ్డి ఉన్నాడు. ఈయన ప్రఖ్యాత ములకనూరు పాల డైరీకి స్థాపకులు.. వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచాడు కూడా. ఇప్పుడు వరుసగా రెండు సార్లు ఓడిపోయాడు. బీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ పై ఇక్కడ వ్యతిరేకత బాగా ఉంది. స్థానికుడైన ప్రవీణ్ రెడ్డి ని కాంగ్రెస్ దించితే ఈజీగా ఈ సీటు గెలవొచ్చు. కానీ కరీంనగర్ నుంచి నాన్ లోకల్ అయిన పొన్నం ప్రభాకర్ ను ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టారు. ఆయన గెలిచే అవకాశాలు ఉండవు. అదే మైనస్ గా మారింది. నిజానికి కరీంనగర్ లో బలమైన డబ్బు, పరపతి ఉన్న గంగుల కమాలకర్ (ప్రస్తుత మంత్రి)పై గెలవడం పొన్నంతో కాని పని. అంత పెట్టే డబ్బు, పరపతి పొన్నంకు లేదు. గంగుల కు భయపడే హుస్నాబాద్ ను పొన్నం ప్రభాకర్ వెళ్లాడని కొందరు గుసగుసలాడుతున్నారు.

    ఆదిలాబాద్‌ నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావులకు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితినే.. ఈ జిల్లా వారే అయినా కూడా వారంతా అక్కడ నాన్ లోకల్. బలమైన డబ్బు, పరపతి ద్వారానే ఈ సీట్లు దక్కించుకున్నారు.

    ఇలా కాంగ్రెస్ తమవి కాని సీట్లలో పోటీచేస్తున్నారు. తమ సొంత స్థానాలను వదిలి చాలా మంది నాన్ లోకల్ సీట్లలో పోటీకి దిగారు. అదే వారి కొంప ముంచుతుందా? లేక కాంగ్రెస్ గాలిలో గెలిచేస్తారా? అన్నది వేచిచూడాలి.