Padmaja joins BJP : కేరళలో ఇవాళ ఆశ్యర్యకర పరిస్థితులున్నాయి. సంవత్సరం క్రితం కాంగ్రెస్ కు ఆరాధ్యుడైన ఏకే అంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. బీజేపీకి అధికార ప్రతినిధిగా ఎదిగాడు. ఆ తర్వాత పట్టనంతిట్ట ఎంపీ సీటులో బీజేపీ తరుఫున పోటీచేస్తున్నారు.
కేరళ కాంగ్రెస్ ను ఏలిన కరుణాకరన్, ఏకే ఆంటోనీల వారసులు బీజేపీలోకి రావడం విశేషం. నిన్న ఇంకో సంఘటనలో కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్ బీజేపీలో చేరారు. ఈమె తక్కువేం కాదు.2004లో ఎంపీగా పోటీచేసింది. రెండు సార్లు త్రిసూర్ ఎంపీ స్థానానికి పోటీచేసింది. గెలవలేదు..
నన్ను కావాలనే కాంగ్రెస్ వాళ్లే ఓడిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ హైకమాండ్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకోలేదు. కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా ఉంది.
కేరళలో కరుణాకరన్ కుమార్తె బీజేపీలో చేరిక.. కాంగ్రెస్ నేతలందరూ బీజేపీలో చేరికపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.