Revanth Reddy : రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా?

కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కేసీఆర్ పై వ్యతిరేకత అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక్కడ లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వ్యక్తి లేకుండా పార్టీ లేదు. వ్యక్తి వల్లనే అధికారం సాధ్యమవుతుంది.

Written By: NARESH, Updated On : December 9, 2023 2:32 pm

Revanth Reddy : రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాకపోయి ఉన్నట్టయితే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చేదా? అన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతనే కాంగ్రెస్ ను గెలిపించిందని అంటున్నారు. కానీ ఇది నిజం కాదు.. భారత రాజకీయాలు చూసినా కూడా పార్టీతోపాటు వ్యక్తి ప్రాముఖ్యత మొదటి నుంచి ఉన్నది. వ్యక్తుల వల్లనే పార్టీలు గెలుస్తున్నాయి..

పరిస్థితి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ గెలవలేదు. మోడీ వల్లనే కేంద్రంలో బీజేపీ 2014, 2019లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. మోడీ లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదన్నది ఎక్కువ మంది భావన.. వచ్చినా పొత్తులతో సాగే ప్రభుత్వం వచ్చి ఉండేది. ఇది నిజం..ఇలా చాలా ఉదాహరణలున్నాయి..

తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినా కూడా అధికారంలోకి రాకపోవడానికి కారణం.. అవతల వైపున కేసీఆర్ లాంటి ధీటైన నేత కాంగ్రెస్ లో లేకపోవడమే కారణం. 2014, 2018లో బీఆర్ఎస్ గెలుపునకు కేసీఆర్ కారణం..

కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కేసీఆర్ పై వ్యతిరేకత అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక్కడ లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వ్యక్తి లేకుండా పార్టీ లేదు. వ్యక్తి వల్లనే అధికారం సాధ్యమవుతుంది.

రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.