Comedy Kings : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కమెడియన్ సీఎం కాబోతున్నారు. స్వయంకృషితో మొదట సినిమాల్లో జనాలను నవ్వించి ఇప్పుడు వారి ఆదరాభిమానాలు పొంది ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నాడు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. పంజాబ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కమెడియన్లు రాజ్యాధికారం సాధించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం సాగుతోంది. బలమైన రష్యాను ఎదురించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక కమెడియన్ కావడం విశేషం. జెలెన్ స్కీ ధైర్యసాహసాలతో అతడి పేరు మారుమోగుతోంది. రష్యా సైన్యంపైకి స్వయంగా ఆర్మీ దుస్తుల్లో వెళ్లి పోరాడి ఉక్రెయిన్ సైన్యంలో ధైర్యం నింపిన గొప్ప నేతగా జెలెన్ స్కీ పేరు చరిత్రలో నిలిచింది. జెలెన్ స్కీ ఎవరు? అని ఆరాతీస్తే అతడు ఒక కమెడియన్ అని తేలింది. నిజజీవితంలో కమెడియన్ అయినా కూడా ఏకంగా రష్యా అద్యక్షుడు పుతిన్ కు ఎదురితిరిగి హీరో అయ్యాడు జెలెన్ స్కీ.

ఇక పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటైన పోటీనిచ్చిన పంజాబ్ ఆప్ పార్టీ అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ సైతం గతంలో కామెడీ నటుడు కావడం విశేషం. మాన్ గతంలో పంజాబ్ ప్రజలకు కామెడీ నటుడు అనే విషయం మాత్రమే తెలుసు. ఇప్పుడు పంజాబ్ సీఎం పీఠంపై భగవంత్ సింగ్ మాన్ కూర్చోబోతున్నారు. పంజాబ్ సీఎం గతంలో ఒక కామెడీ నటుడు అన్న విషయం బయటకు రావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో జెలెన్ స్కీ పేరు, పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ అన్న దేశం ఒకటుందని.. దానిపై రష్యా దాడి చేసిందని ఇది జరిగే వరకూ ప్రపంచానికి పెద్దగా తెలియదు.. కానీ రష్యాను ఎదురించి ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడింది.

-ఉక్రెయిన్ అధ్యక్షుడు కామెడీ నటుడే..
ఉక్రెయిన్ అధ్యక్షుడు అయిన జెలెన్ స్కీ ఒకప్పుడు కామెడీ నటుడే. గతంలో టీవీ షోల్లో, కామెడీ షోల్లో నటించాడు. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యాడు. అంతేకాదు.. జెలెన్ స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఓ కామెడీ షోలో నటించాడని.. కొన్ని సంవత్సరాల తర్వాత నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యాడని ప్రపంచానికి తెలిసింది.
-కామెడీ కింగ్ నుంచి సీఎం పీఠం వరకూ భగవంత్ మాన్..
ఇక పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని నడిపించి ఆ రాష్ట్ర సీఎంగా ఎన్నికవుతున్న భగవంత్ సింగ్ మాన్ కూడా ఒకప్పుడు కమెడియన్ కావడం విశేషం. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కు ధీటైన పోటీనిచ్చి పంజాబ్ ఆప్ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ వేసిన వ్యూహాలు, దూకుడు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి. గతంలో మాన్ కూడా కామెడీ నటుడు అనే విషయం పంజాబీలకు తెలుసు.
-ఉక్రెయిన్ టు పంజాబ్ కామెడీ కింగ్ లదే రాజ్యం
ఉక్రెయిన్ అధ్యక్షుడు, పంజాబ్ కాబోయే సీఎం ఇద్దరూ కామెడీ స్టార్ లే అని తెలియడంతో వైరల్ అయ్యింది. ఇప్పుడు వీరి పేర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. జెలెన్ స్కీ, భగవంత్ సింగ్ మాన్ లు హాట్ టాపిక్ గా మారారు.