cm kcr speech in janagama sabha : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రెచ్చిపోయారు. మోడీపై విరుచుకుపడ్డారు. ‘మోడీ ఉడుత ఊపులకు.. పిట్ట బెదిరింపులకు బెదిరేది లేదంటూ’ జనగామ జిల్లాలో తొడగొట్టేశారు. మొన్నీ మధ్యే ప్రెస్ మీట్ లో రెచ్చిపోయిన కేసీఆర్.. ప్రధాని హైదరాబాద్ కు వచ్చినా స్వాగతించలేదు. ఆయనతో పాటు పర్యటించలేదు. దీంతో మోడీపై సీరియస్ గానే కేసీఆర్ మూవ్ అవుతున్నట్టు అర్థమైంది.

మోడీ సర్కార్ విధానాలను.. మోడీ చర్యలను.. బీజేపీ బెదిరింపులను కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. జనగామలో కలెక్టరేట్ సహా అభివృద్ధి పనులను ప్రారంభించినసందర్భంగా కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ‘మీరందరూ దీవిస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడుతా.. జాగ్రత్త మోడీ.. ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు.. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. మమ్మల్ని టచ్ చేస్తే నాశనం చేస్తాం’ అని కేసీఆర్ మెచ్చరించారు.
కేసీఆర్ తీరు చూస్తుంటే ప్రజల ఆశీర్వాదంతోనే మోడీతో ఫైట్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎంపీ సీట్లను గెలవడంపైనే కేసీఆర్ ఈ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.అందుకే ప్రజల ఆశీర్వాదం ఉంటేనే తాను మోడీని ఎదురిస్తానంటూ కేసీఆర్ సరికొత్త పల్లవి అందుకున్నారు.
మోడీతో ఫైట్ కు రెడీ అయిన కేసీఆర్ వ్యూహాత్మకంగానే బీజేపీని టార్గెట్ చేశారు. ఈక్రమంలోనే ఇప్పటిదాకా బయటకు అడుగుపెట్టని కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు చేరువ అవుతున్నారు. తన సహజశైలికి భిన్నంగా హైదరాబాద్ వీడి జిల్లాల బాటపట్టారు. బీజేపీ ప్రజల్లోనే కొట్లాడుతుండడంతో ఇఫ్పుడు టీఆర్ఎస్ కూడా అదే బాట పట్టింది. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి బీజేపీపై మెల్లిమెల్లిగా వ్యతిరేకతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్ తన పంథా మార్చుకొని ప్రజల్లోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యారని అర్థమవుతోంది.వచ్చే ఎన్నికల్లోగా బీజేపీపై ఎంత వీలైతే అంత వ్యతిరేకతను వ్యాపింపచేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి కేసీఆర్ ను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందన్నది వేచిచూడాలి.
[…] […]
[…] […]