Hyderabad Drugs Case : డ్రగ్స్ కేసు లో సినీ రచయిత దర్శకుడు…తీగలాగితే డొంక కదులుతుంది…

ఈ డ్రగ్స్ కేసు లో ఇప్పటికే సినీ దర్శకుడు అయిన మంతెన వాసువర్మను మాదాపూర్ పోలీసులు సెప్టెంబర్ 5న అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Written By: Gopi, Updated On : September 25, 2023 10:11 am

tollywood drugs case

Follow us on

Hyderabad Drugs Case : సినిమా ఇండస్ట్రీ లో సినిమాల ద్వారా ఫేమస్ అవ్వడం కంటే కూడా కొంత మంది డ్రగ్స్ కేసు లో ఇరుక్కొని ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్లలో చాలా మంది ఇండస్ట్రీ లో ఉన్నారు అప్పట్లో పూరి జగన్నాథ్, రవి తేజ, సుబ్బరాజు లాంటి వాళ్ల పేర్లు కూడా వినిపించాయి. కాగా ఇప్పుడు రీసెంట్ గా మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది…

ఇక ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సినీ దర్శకుడు అయిన మంతెన వాసువర్మను మాదాపూర్ పోలీసులు సెప్టెంబర్ 5న అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసుతో ఈయన కి సంబధం ఉన్నట్లు గా కూడా పోలీసుల విచారణ లో తెలుస్తుంది…

ఇక ఇదే కేసులో సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పుణేకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ అశోక్ తెలోర్ జూన్‌లో అరెస్టయ్యారు.ఇక అప్పటి నుంచి వీళ్ళ ఆచూకీ ఎక్కడ కనిపించకపోవడం తో పోలీసులు ఇన్నిరోజులు వీరి అరెస్ట్ ని రహస్యం గా ఉంచినట్లు గా తెలుస్తోంది. ఇక అయితే ముంబైకి చెందిన విక్టర్, పుణెలో ఉంటున్న రాహుల్ అశోక్ తెలోర్ పరిచయస్తులకు డ్రగ్స్ విక్రయిస్తుంటారని తెలిసింది…డ్రగ్స్ కేసు లో తీగ లాగితే డొంక కదిలినట్లు గా ఒక్కొక్కరి పేరు బయటికి వస్తుంది.

ఇక రాహుల్, విక్టర్ నుంచి నార్సింగికి చెందిన పృథ్వీకృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించేవాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గత జూన్ 19న పృథ్వీకృష్ణ, రాహుల్ ను అరెస్ట్ చేశారు. ఇక అందులో భాగంగానే వీరి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో బస్తీ అనే సినిమా దర్శక, నిర్మాత, ఓ ట్రస్ట్ ఛైర్మన్, శేరిలింగంపల్లిలో ఉంటున్న మంతెన వాసువర్మ కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.ఇలా డ్రగ్స్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ బయటికి తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు …ఇక అందులో భాగంగానే రీసెంట్ గా హీరో నవదీప్ ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.ఇప్పటికే ఆయన దగ్గర ఉన్న మొబైల్ ని తీసుకొని ఆయన డిలీట్ చేసిన కాంటాక్ట్ లిస్ట్ గానీ , మెసేజ్ లు గానీ బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు…సినిమా ఇండస్ట్రీ కాస్త రోజు రోజు కి డ్రగ్స్ ఇండస్ట్రీ గా మారిపోతుంది అంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు…