Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi Jagan: టీడీపీ-జనసేన పొత్తుకు విరుగుడుగా జగన్ తో చిరంజీవినా?

Chiranjeevi Jagan: టీడీపీ-జనసేన పొత్తుకు విరుగుడుగా జగన్ తో చిరంజీవినా?

Chiranjeevi Jagan:  2024 ఎన్నికలు ఏపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే బలమైన వైసీపీ ఒకవైపు.. బలహీనంగా మారిన టీడీపీ.. ఏపీలోని ఇతర పక్షాలైన జనసేన-బీజేపీ కలిసి సాగేందుకు ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే ‘కాపు ఓటు బ్యాంకు’ మొత్తం వీరికే టర్న్ అవుతుంది. ఏపీలో అత్యధిక శాతం ఉండి.. రాజకీయాలను శాసించేలా ఉన్న కాపులు దూరమైతే అధికార వైసీపీకి గడ్డు కాలమే.. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ కు విరుగుడుగా ఆయన సోదరుడు చిరంజీవిని మచ్చిక చేసుకోవడానికి జగన్ ప్లాన్ చేశారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

అయితే సినిమా టికెట్ల వివాదంపై జగన్ ను కలిశానని చిరంజీవి ఎంత మొత్తుకుంటున్నా.. ఓ వర్గం మీడియా మాత్రం చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకే జగన్ పిలిపించారని లీకులు ఇచ్చింది. టీడీపీ-జనసేన పొత్తును ఎదుర్కోవడానికి జగన్ ఇదొక బలమైన వ్యూహంగా కూడా భావిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి.

ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు. తాను రాజ్యసభ టికెట్ కోసం అలాంటి ఆఫర్ ను ఆశించి రాలేదని.. అలాంటి వాటికి అంగీకరించనని.. తాను రాజకీయాల్లోంచి ఎప్పుడో వైదొలిగానని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అధికార వైసీపీ తనకు ఎలాంటి ఆఫర్ ఏమీ ఇవ్వలేదని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో చిరు రాజ్యసభ ఊహాగానాలకు తెరపడింది.

అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు చిరంజీవి ఒప్పుకుంటే సినిమా టికెట్ల వివాదంతోపాటు రాజ్యసభ ఆఫర్ ను కూడా జగన్ చేశాడని.. కానీ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం చిరంజీవి లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

దీంతో జగన్ చిరంజీవి మధ్య కేవలం సినిమా టికెట్ల వివాదంపైనే సాగినట్టు తెలుస్తోంది. అనుకున్న కార్యం జరగకపోయేసరికి జగన్ కూడా సినిమా టికెట్ల వివాదంపై హామీ ఇవ్వనట్టు తెలిసింది. ఇలా చిరు-జగన్ భేటి అసంతృప్తిగా ముగిసినట్టు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version