Tollywood Jagan: ఆరునెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. అమరావతి వెళ్లి మరీ సీఎం జగన్ ను కలిసిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి చివరకు అనుకున్నది సాధించారు. సినీ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే జీవో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.ఈనెలాఖరులోపే ఆ జీవో వస్తుందని.. సమస్యలకు శుభం కార్డు పడనుంది.

ఆంధ్రాలో ఈ సినిమా కష్టాలు తీరడంలో నిస్సంకోచంగా చిరంజీవిదే కీరోల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, కార్యవర్గం ఈ సినిమా కష్టాలు తీర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. జగన్ తమకు బంధువే అయినా మోహన్ బాబు, విష్ణు సమస్య పరిష్కారంలో ఏమాత్రం చొరవ , చిత్తశుద్ధి చూపలేదు.
ఈక్రమంలోనే చిరంజీవి తనకు తానుగా చొరవ తీసుకొని జగన్ ను కలిసి టాలీవుడ్ సినిమా కష్టాలు తీర్చాడు. దీన్ని బట్టి ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాలీవుడ్ పెద్ద దిక్కు చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే మాటను తాజాగా జగన్ ను కలిసిన అనంతరం మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి నొక్కి వక్కాణించారు.
మరి నిజంగా తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి పెద్ద దిక్కునా? ఆంధ్రాలో సినిమా కష్టాలు గట్టెక్కాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

[…] Also Read: తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవినే పెద… […]