China: చిన్నపిల్లలు దగ్గుతో బాధపడుతున్నారు. జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నారు. ఇది కేవలం ఒక్కచోట మాత్రమే కాదు.. మొత్తం ఇదే పరిస్థితి.. ప్రస్తుతం ఇదీ చైనా ఎదుర్కొంటున్న దుస్థితి. మొన్నటిదాకా దీనిని బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది కానీ.. ఇటీవల పరిస్థితి చేయి దాటిపోవడంతో గత్యంతరం లేక బయటకు చెప్పేసింది. చైనాలో ఏం జరుగుతోంది? కోవిడ్ తర్వాత చైనా ప్రపంచం మీదకి ఏం రుద్దబోతోంది?
శ్వాస సంబంధిత సమస్యలతో..
సాధారణంగా చైనాలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి డిసెంబర్ మాసాలలో మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. సాధారణంగానే చైనా దేశస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు వారు మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. పైగా ఆ తినే విధానంలోనూ ఒక పద్ధతి అంటూ పాటించరు. దీనివల్ల అంతిమంగా వారు రకరకాల అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. అందువల్లే త్వరగా వారు వైరస్ల బారిన పడుతూ ఉంటారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి కూడా అలానే జరిగింది. మొదట యుహన్ ప్రాంతంలో ప్రబలిన వైరస్.. తర్వాత క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరించింది. అది ప్రపంచాన్ని వణికించింది. ఆ వైరస్ వల్ల ప్రపంచం రెండు సంవత్సరాలు పాటు ఇబ్బంది పడింది. చైనా కూడా మొన్నటిదాకా ఆ దుస్థితిని స్వయంగా చూసింది. అయితే ఇప్పుడు ఆ వైరస్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచానికి చైనా మరో దుర్వార్త చెప్పింది. ఆ దేశంలో గత కొద్దిరోజులుగా న్యూమోనియా సంబంధిత కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఎందుకు ఇలా
ముందుగానే మనం చెప్పుకున్నట్టు చైనా దేశస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారం. ఆకాశంలో ఎగిరేవి, నేల మీద నడిచేవి, నీటిలో ఈ దేవి.. ఇలా వేటిని కూడా వారు వదిలిపెట్టరు. పైగా మాంసాహారాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. దీనివల్ల సహజంగానే వారి శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు చైనా దేశంలో ఇంకా రకరకాల వైరస్ ఆనవాళ్లు ఉండడంతో అవి వివిధ రూపంలో ప్రజలపై దాడి చేస్తున్నాయి. తాజాగా చిన్నపిల్లల్లో న్యుమోనియా కేసులు బయటపడటం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది. ముఖ్యంగా వారు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో అవస్థలు పడుతున్నారు. న్యూమోనియా వైరస్ వ్యాప్తి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. చైనా దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఆస్పత్రులు మొత్తం చిన్నపిల్లలతో కిటకిటలాడుతున్నాయి. మరణాలు నమోదు కానప్పటికీ ప్రస్తుతానికైతే ఆ దేశంలో ఆరోగ్య అత్య యిక పరిస్థితి కొనసాగుతోంది. ఇక దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే చైనా నుంచి వచ్చేవారికి ప్రత్యేక పరీక్షలు చేసి ఆయా దేశాలు తమ ప్రాంతాల్లోకి అనుమతినిస్తున్నాయి. జనాభా పరంగా అతిపెద్ద దేశం కాబట్టి.. భారత్ కూడా రకరకాల పరీక్షలు చేసిన తర్వాతే అనుమతినిస్తోంది. దేశంలోని ప్రధాన నగరంలో ఆ తరహా కేసులు ఏమైనా నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుగానే మందులు, ఇతర వైద్య సామాగ్రిని అందుబాటులో ఉంచింది.