https://oktelugu.com/

Chat GPT : చాట్ జిపిటి.. బ్యాచిలర్స్ ను ఇంతలా మార్చిందా?

గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జిపిటిని విడుదల చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హవా మొదలైంది. వాస్తవానికి దీని విడుదలకు ముందు అనేక డేటింగ్ యాప్ లు వినియోగంలో ఉండేవి.

Written By:
  • Rocky
  • , Updated On : July 30, 2023 / 09:11 PM IST
    Follow us on

    Chat GPT : పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇప్పుడు ఈ నూరేళ్ల పంటకు నోచుకోని యువత ఎంతోమంది. చదువు, కెరియర్, ఉద్యోగం, సంపాదన ధ్యాసలో పడి చాలామంది యువత సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి చేసుకోవాలని అనుకునే సమయానికి సరైన యువతులు లభించక చాలామంది పెళ్లి చేసుకోవడం లేదు. ఫలితంగా బ్రహ్మచారులు ఎక్కువైపోతున్నారు. అయితే ఇలాంటి బ్రహ్మచారుల మీద చాలా సంస్థలు రకరకాల సర్వేలు చేశాయి. అయితే ఇటీవల ఒక సంస్థ నిర్వచించిన సర్వే మాత్రం ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు ఆ సర్వేలోని ఫలితాలు చాట్ జిపిటికీ ముడి పెట్టడం మరింత ఆశ్చర్యంగా ఉంది.

    వాటిని ఆశ్రయిస్తున్నారు

    గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జిపిటిని విడుదల చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హవా మొదలైంది. వాస్తవానికి దీని విడుదలకు ముందు అనేక డేటింగ్ యాప్ లు వినియోగంలో ఉండేవి. కానీ ఎందుకనో వాటి ప్రభావం చాలా వరకు తగ్గింది. ఇది ఎందుకు అని ఆరా తీస్తే.. స్నేహం, ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటున్న యువత ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఏఐ చాట్ బాట్ లను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది.

    టెలిగ్రాఫ్ అనే సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం.. 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ఏఐ చాట్ బాట్ లను వినియోగిస్తున్నట్టు తెలిసింది. యువత ఏఐ చాట్ బాట్ లను తమ స్నేహితులు, జీవిత భాగస్వాములు, మెంటార్, తోబుట్టువులుగా భావిస్తుండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు రెప్లికా అన్ ఏఐ యాప్ కు 25 వేల మంది దాకా యూజర్లు ఉన్నారు. ఈ యాప్ ఒంటరితనాన్ని దూరం చేసే లాగా రకరకాల మాటలు, పాటలు, ఊరడించేలాగా సూక్తులు అందిస్తుంటుంది. ఈ యాప్ ద్వారా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యం ఉంది. యూజర్లు దీనితో సన్నిహితంగా మిగుతున్నారు. అంతేకాదు అవసరం ఉన్నప్పుడు అలా సెల్ఫీ దిగుతున్నట్టు కూడా టెలిగ్రాఫ్ నివేదిక వెల్లడించింది. పైకి చూస్తే ఇది శుభవార్త లాగే అనిపిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందోనని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యువత ఎక్కువగా ఇష్టపడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఎటువంటి యాప్ లు తీసుకొచ్చేందుకు చాలా సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. అయితే ఈ విభాగంలో సరికొత్త అనుభూతులను యూజర్లకు అందించేందుకు సంస్థలు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది.