Chandrayaan 3 : చంద్రుడిపై మన రోవర్ విక్రమ్ దిగిందిలా.. వైరల్ వీడియో

ల్యాండర్ నుంచి రోవర్ జారుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి అడుగుపెట్టిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Written By: NARESH, Updated On : August 25, 2023 12:06 pm
Follow us on

Chandrayaan 3 : చంద్రుడి దక్షిణ దృవంపై దిగిన మన చంద్రయాన్ 3 మిషన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేదు. ఇలా దింపి భారత్ చరిత్ర సృష్టించింది.

ఇస్రో పంపిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ తర్వాత అందులోని ల్యాండ్ నుంచి రోవర్ బయటకు వచ్చింది. మెల్లగా దిగింది. ఈ వీడియోను తాజాగా ‘ఇస్రో’ విడుదల చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ జారుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి అడుగుపెట్టిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇస్రో మరో కీలక ఘనతను సాధించింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలు మోపిన దాదాపు నాలుగు గంటల అనంతరం దాని లోపలి నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది.

చంద్రుడి ఉపరితలంపై నిర్దేశించిన ప్రదేశంలోనే చంద్రయాన్‌-3 ‘విక్రమ్‌’ ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయిందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ‘‘అనుకున్న ప్రదేశంలోనే ల్యాండర్‌ ల్యాండ్‌ అయింది. ల్యాండింగ్‌ లొకేషన్‌, కేంద్రాన్ని గుర్తించాం. గురువారం తెల్లవారు జామున ల్యాండర్‌ నుంచి (ప్రజ్ఞాన్‌) రోవర్‌ వేరు పడింది. రోవర్‌ తన అన్వేషణను మొదలుపెట్టింది.