https://oktelugu.com/

Chandrayaan 3 : సాయంత్రం లైవ్.. చంద్రుడికి మరింత దగ్గరగా.. 70 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ 3

విక్రమ్ ల్యాండర్ లో ఇస్రో పెట్టిన కెమెరా ఇప్పుడు 70 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడు ఫోటోలు తీసి పంపింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 01:15 PM IST

    Chandrayaan 3

    Follow us on

    Chandrayaan 3 : చారిత్రాత్మక ఘట్టం కోసం యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నింగిలోకి తీసుకెళ్లిన చంద్రయాన్ 3 వ్యోమ నౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టనుంది.జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన కీలక విక్రం లాండర్ నేడు చంద్రుడు పై దిగనుంది. సరిగ్గా సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రమండలాన్ని తాకనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగు పెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

    ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మిషన్ విజయవంతం అయితే.. అమెరికా, సోవియట్ రష్యా, చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా ఇండియా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ జాబిల్లి దక్షిణ ధృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా ఖ్యాతికి ఎక్కనుంది. నాలుగేళ్ల కిందట ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 లోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగే క్రమంలో చివరి నిమిషంలో కుప్పకూలింది. ఇటీవల రష్యా చేపట్టిన లూనార్ 25 కూడా ఈ నెల 19న చంద్రుడు పై క్రాస్ ల్యాండ్ అయ్యింది. దీంతో చంద్రయాన్ 3 ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ లాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్ను దింపేందుకు చంద్రుడిపై సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు. సూర్యుడు వెలుగు రాగానే సాఫ్ట్ లాండింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాల నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికి శాస్త్రవేత్తలు డిసైడ్ అయ్యారు. అక్కడ నుంచి 6 గంటల నాలుగు నిమిషాల వరకు అత్యంత టెర్రర్ గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. లాండర్ మార్గిల్ పారామీటర్ల పనితీరు అసాధారణంగా ఉందని తేలితే ల్యాండింగ్ ప్రక్రియను ఈనెల 27కు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

    ఈ క్షణం కోసం దేశ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం సగర్వంగా చెప్పుకుంటున్నారు. చంద్రుడి ఉపరితలంపై విక్రం ల్యాండర్ సాఫ్ట్ లాండింగ్ ప్రక్రియను లైవ్ టెలికాస్ట్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల నుంచి ఇస్రో వెబ్సైట్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ తో పాటు డిడి నేషనల్ ఛానల్ లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

    విక్రమ్ ల్యాండర్ లో ఇస్రో పెట్టిన కెమెరా ఇప్పుడు 70 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రుడు ఫోటోలు తీసి పంపింది. దీంతో చంద్రుడి దక్షిణ ద్రవం ఎలా ఉందో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇస్రో తాజాగా విడుదలచిన ఈ ఫొటోల్లో వాస్తవంగా చంద్రుడు ఉపరితలం ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. మట్టిలో వర్షపు చుక్కలు పెడితే ఎలా ఉంటుందో.. అలా ఉన్న చంద్రుడు ఉపరితలం ఇందులో కనిపిస్తుంది