Chandrayaan 3 : చంద్రయాన్- 3 ప్రయోగంలో భారత శాస్త్రవేత్తలు వరుస విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఒక్కో ఘట్టాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళి ప్రస్తుతం ఒక్క అడుగు దూరంలో కొనసాగుతోంది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యుల్ కక్ష్యను శాస్ర వేత్తలు విజయవంతంగా తగ్గించారు.దీంతో భారతీయులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక ఘట్టం పూర్తి దశకు వచ్చింది.
భారత్ నుంచి పంపిన చంద్రయాన్ -3 చంద్రుడి పై అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. శనివారం అర్ధరాత్రి శాస్రవేత్తలు తెలిపిన ప్రకారం.. రెండో చివరి డీ బూస్టింగ్ ను పూర్తి చేశారు.దీంతో ఇక చంద్రుడిపై కాలుమోపడమే తరువాయి. ఆగష్టు 23 సాయంత్రం 5.45 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగు పెట్టనుంది. ప్రస్తుతం ల్యాండర్ చంద్రుడికి కనిష్టంగా 25 కి లో మీటర్లు, గరిష్టంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అయితే చంద్రయాన్- 2 లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని చందయాన్ -3 తయారు చేశారు. ఇప్పటి ల్యాండర్ ఆటోమేటిక్ గా చంద్రుడిపై దిగేందుకు టెక్నాలజీని తయారు చేసినట్లు ఇటీవల మాజీ శాస్త్రవేత్త మాధవన్ నాయర్ తెలిపారు. అందువల్ల చంద్రయాన్ -౩ విజయవంతంగా ల్యాండ్ అవుతుందని నమ్ముతున్నారు. అయినా చివరి ఘట్టం పూర్తయ్యే వరకు శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉత్కంటతో ఎదురు చూస్తున్నారు.
Chandrayaan-3 Mission:
The Lander Module (LM) health is normal.LM successfully underwent a deboosting operation that reduced its orbit to 113 km x 157 km.
The second deboosting operation is scheduled for August 20, 2023, around 0200 Hrs. IST #Chandrayaan_3#Ch3 pic.twitter.com/0PVxV8Gw5z
— ISRO (@isro) August 18, 2023
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Chandrayaan 3 completes final lunar orbital move next stop moon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com