https://oktelugu.com/

Chandrababu : దేవుడైపోయిన చంద్రబాబు.. మందులు వాడాల్సిందే!

చంద్రబాబు తనను తాను దేవుడిగా ఊహించుకుంటున్నాడా? ఈ మాటలు ఏంటి? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2023 / 04:20 PM IST
    Follow us on

    Chandrababu : తొండ ముదిరి ఊసరవెళ్లి అయిపోవడం చూశాం.. కానీ పాపం మన చంద్రబాబు మనిషి నుంచి దేవుడిగా మారిపోయాడు. ఎంతలా అంటే తాను ఇచ్చే రాఖీ తాయత్తుకు 47 రోజులు పూజలు చేసుకొని తనను తలిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని.. దేవుడికే నేను చెబుతానంటూ సభల్లో చెప్పేస్తున్నారు.

    చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటిపోయింది. సహజంగా ఈ ఏజ్ వచ్చాక కాసింత చాదస్తం.. మతిమరుపు వచ్చేస్తుంటుంది. ఎవ్వరూ చెప్పినా ఈ తాతలు అస్సలు వినరు. తాము పట్టిన కుందేళ్లకు మూడే కాళ్లు అంటారు. మన ఊళ్లలో మన తాతలు ఇలానే ప్రవర్తించేవారు.

    ఇన్నాళ్లు చంద్రబాబు కొంచెం మెచ్చూర్డ్ గానే ప్రవర్తించేవారు. కానీ ఏమైందో కానీ ఈ మధ్యన ఇంగితం కోల్పోతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఇటీవలే ‘ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి’ అని నిండు సభలో బాబు మాట్లాడిన మాటలు నవ్వుల పాలయ్యాయి.

    ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ ‘ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఓ రాఖీ పంపిస్తా. 45 రోజులు పూజ రూంలో పెట్టి పూజలు చేయండి. రాఖీని ఆ మహాశక్తిని చేతికి కట్టుకొని తనను ఒకసారి తలుచుకోండి. ఏ కష్టమొచ్చినా ఊహించుకోండి.. మీ కష్టాలు తీర్చే బాధ్యత భగవంతుడు చేస్తాడు. ఆ భగవంతుడి సంకల్పానికి అండగా ఉంటాను’ అంటూ దేవుడికే దేవుడు లాంటి వాడిని అని చంద్రబాబు అనేశాడు.

    ఈ డైలాగ్ దుమారం రేపింది. చంద్రబాబు తనను తాను దేవుడిగా ఊహించుకుంటున్నాడా? ఈ మాటలు ఏంటి? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు కాస్త సోయిలో జనం మధ్యలో మాట్లాడాలని.. లేదంటే మందులైనా వాడి సరిచేసుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.