https://oktelugu.com/

AP High Court: హైకోర్టులో చంద్రబాబుకు మళ్లీ గట్టి షాక్

చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో మొన్న శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ లపై అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు భావించారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 9, 2023 1:43 pm
    Chandrababu
    Follow us on

    AP High Court: టిడిపి అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, అంగళ్లు కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు తీర్పులను వెల్లడించింది. పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబుకు మరోసారి షాక్ తగిలింది.

    చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో మొన్న శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ లపై అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు భావించారు.అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తీర్పు అనుకూలంగా వస్తుందని అంచనా వేశారు. కానీ షాక్ తప్పలేదు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.

    మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరగనుంది. తనపైమోపిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 3న ధర్మాసనం ఇరుపక్షాల వాదనను వినింది. హైకోర్టుకు దాఖలు పరిచిన పత్రాలను తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పత్రాలను రాష్ట్ర ప్రభుత్వాధికారులు సుప్రీంకోర్టుకు అందించారు.మరి కొద్ది సేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం రాజకీయ కక్ష సాధింపులకు చెక్ పడినట్టే. లేకుంటే మాత్రం గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.