https://oktelugu.com/

Chandrababu : మళ్లీ చంద్రబాబుకు షాక్.. మరో 14 రోజులు రిమాండ్

చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2023 6:12 pm
    Chandrababu Jail Food

    Chandrababu Jail Food

    Follow us on

    Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు కష్టాలు తప్పడం లేదు. ఆయన విడుదల అవుతారని విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి మొదలు పెడితే ఢిల్లీలోని సుప్రీంకోర్టు వరకూ పోరాడుతున్న చంద్రబాబు లాయర్లకు ఎక్కడా గుడ్ న్యూస్ దక్కడం లేదు. చంద్రబాబు క్వాష్ పిటీషన్ కొట్టివేయబడడం లేదు. ఆయనకు బెయిల్ దక్కడం లేదు.

    తాజాగా చంద్రబాబుకు మరోసారి షాక్ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు తాజాగా పొడిగిస్తూ షాకిచ్చింది. ఈకేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ఎదుట హాజరుపరిచారు.

    మరోవైపు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ ను రెండు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు ఈ నెల 19 వరకు రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది.

    మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ , సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటీషన్లపై వరుసగా రెండు రోజులు సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి.

    చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇందులో ఖరీదైన బాబు లాయర్ మీద ప్రభుత్వ లాయర్ వాదనలే నెగ్గి విజయం సాధించడం విశేషం.