https://oktelugu.com/

Chandrababu vs Pawan Kalyan : చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఓ అడగని ప్రశ్న!

బిజెపి వైపు ఈ ఇద్దరు నేతలు ఎందుకు వెళుతున్నట్టు? రాజకీయ పార్టీలకుఅవసరాలే తప్ప.. ప్రజా సమస్యలు పట్టవు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి.. దాని సాయం ఉండాలి కాబట్టి.. ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు బిజెపి నామస్మరణ చేస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 / 02:07 PM IST
    Follow us on

    Chandrababu vs Pawan Kalyan : ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ వస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. 2014 పొత్తులు రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరేళ్ల విరామం తర్వాత టిడిపి ఎన్డీఏలోకి ఎంట్రీ ఇవ్వనుంది.అటు బిజెపి సైతం ఏపీలో టిడిపి, జనసేన కూటమిలో చేరి సీట్లను పెంచుకునేందుకు నిర్ణయించుకుంది.అయితే ఈ మూడు పార్టీల కలయిక వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.

    2014 ఎన్నికల్లో టిడిపి,బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు ప్రకటించింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఎన్డీఏ ప్రభుత్వాలు నడిచాయి. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని సాకుగా చూపి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందే హోదా ఏమైనా అపర సంజీవినా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు.. జగన్ ప్రత్యేక హోదా పల్లకి ఎత్తుకునేసరికి అలెర్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిజెపి నుంచి సానుకూలత రాకపోవడంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అటు పవన్ సైతం ప్రత్యేక హోదా విషయంలో బిజెపి పై ఒత్తిడి పెంచారు. తొలుత కేంద్ర ప్రభుత్వం హోదా బదులు నిధులు ఇవ్వడాన్ని పాచిపోయిన లడ్డులతో పోల్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి, జనసేన దారుణంగా దెబ్బతిన్నాయి. ఎన్నికల అనంతరం పవన్ బీజేపీ తో జత కలిశారు. ఇప్పుడు చంద్రబాబు సైతం బిజెపి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

    అయితే ఇటు చంద్రబాబు కానీ, అటు పవన్ కు కానీ ప్రత్యేక హోదా గుర్తుకు రాకపోవడం విశేషం. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనే బిజెపితో విభేదించారు. ఇప్పుడు అదే బిజెపితో ఎందుకు కలుస్తున్నారో చెప్పడం లేదు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. తొలి ఫైల్ పై సంతకం పెడతామని కూడా తేల్చేశారు. మరి అటువంటి అప్పుడు చంద్రబాబు, పవన్ లు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ వైపు వెళ్ళాలి కదా? ఇప్పటికే ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనమని బిజెపి తేల్చింది. మరి బిజెపి వైపు ఈ ఇద్దరు నేతలు ఎందుకు వెళుతున్నట్టు? రాజకీయ పార్టీలకుఅవసరాలే తప్ప.. ప్రజా సమస్యలు పట్టవు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి.. దాని సాయం ఉండాలి కాబట్టి.. ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు బిజెపి నామస్మరణ చేస్తున్నాయి.