Chandrababu – Pushpa : పుష్ప సినిమాలో చంద్రబాబు ఫొటో.. భలే క్యాష్ చేసుకున్నాడు

అందుకే చిత్ర యూనిట్ ఆ ఫొటో వాడుంటుంది. అయితే దానిని కూడా చంద్రబాబు సొంత డబ్బా కు వాడుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

Written By: NARESH, Updated On : August 27, 2023 11:52 am

pushpa chandrababu

Follow us on

Chandrababu – Pushpa : ఎందుకో ఈమధ్య చంద్రబాబు గాడి తప్పుతున్నారు. తన స్థాయిని తానే తక్కువ చేసుకుంటున్నారు. అయితే ఆయనకు ఎవరైనా మిస్ గైడెన్స్ చేస్తున్నారా? లేకుంటే వయసు ప్రభావమా? అన్నది తెలియడం లేదు. 2004 ముందు చంద్రబాబు.. ప్రస్తుతం బొత్తిగా కనిపించడం లేదు. లేనిపోని వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలవుతున్నారు. తాజాగా పుష్ప సినిమా విషయంలో సైతం ఇదే వెలడైంది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతియ స్థాయిలో అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ అర్జున్ తో పాటు పుష్ప చిత్ర యూనిట్ ను అభినందిస్తున్నారు.అయితే చంద్రబాబు స్పందించిన తీరు కాస్త భిన్నంగా ఉంది.

ఒక్క అభినందనలతో చంద్రబాబు ఊరుకోలేదు. నేను ఆ సినిమాలో ఉన్నాను అంటూ ప్రకటించారు. దీంతో అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే చంద్రబాబు ఎక్కడున్నారబ్బా అని ఎక్కువ మంది ఆలోచించారు. దాని గురించి చంద్రబాబు నేరుగా చెప్పుకొచ్చారు ” పుష్ప సినిమాలో నేనున్నానని.. నా ఫొటోని కొన్ని సన్నివేశాలు చూపించారని.. కొన్ని బ్యాగ్రౌండ్ సీన్లలో నా ఫొటో కనిపిస్తుందని.. దానిని చూసి వైసిపి వాళ్లు ఏడుస్తున్నారని.. మూవీలో చూపించిన టైంలో నేను సీఎంగా ఉన్నానని ఆ ఫొటో పెట్టారా? లేదా ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశానని నా ఫొటో పెట్టారో తెలియదు” అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై వైసీపీతో పాటు సోషల్ మీడియా నుంచి విపరీతమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ సినిమాను నిశితంగా పరిశీలిస్తే రెండు చోట్ల చంద్రబాబు ఫొటో కనిపిస్తోంది. ఆ రెండూ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోనే. సహజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఉండడం సాధారణమే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో సీఎంగా చంద్రబాబు ఉండేవారు. అందుకే చిత్ర యూనిట్ ఆ ఫొటో వాడుంటుంది. అయితే దానిని కూడా చంద్రబాబు సొంత డబ్బా కు వాడుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

చంద్రబాబు ఏలుబడిలో ఎర్రచందనం విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరిగిందని.. అందుకే చంద్రబాబు ఫొటో పెట్టారని సోషల్ మీడియాలో పోస్టింగులు వైరల్ అవుతున్నాయి. కావలిసే పుష్ప సినిమా యూనిట్ చంద్రబాబు ఫొటోను వాడుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే లేనిపోని మాటలతో చంద్రబాబు పలుచన అవుతున్నారని టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.