Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu in Danger : ప్రమాదంలో చంద్రబాబు..?

Chandrababu in Danger : ప్రమాదంలో చంద్రబాబు..?

Chandrababu in Danger : దేశంలో ఏ రాష్ట్రంలో విపక్ష నేతకు లేనంతగా చంద్రబాబు హై సెక్యూరిటీ ఉంది. జడ్ ప్లస్ సెక్యూరిటీతో 24 మంది కమెండోలు భద్రత కల్పిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ పటిష్ట భద్రత కల్పిస్తోంది. అయినా తరచూ చంద్రబాబు కాన్వాయ్ పై దాడులు జరుగుతునే ఉన్నాయి. ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ భద్రతను టైట్ చేస్తున్నా అనుచిత ఘటనలు చోటుచేసుకునే ఉంటున్నాయి. చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ ఆయన పర్యటనలను అడ్డుకుంటున్నారు. ఆయన కాన్వాయ్ లోకి ఇతర వాహనాలు చొచ్చుకొస్తున్నాయి. ఎన్ఎస్ జీ కమెండోలు ప్రతిఘటిస్తున్నా.. స్థానిక పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. రాజ్యాంబద్ధ పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

మొన్న ఆ మధ్యన చంద్రబాబు కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు కూడా విపక్ష నేతకు అడ్డంకులు ఎదురయ్యాయి. అడుగడుగునా వైసీపీ శ్రేణులు అడ్డగించాయి. అన్నక్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధపడుతుండగా విధ్వంసం సృష్టించారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోలేదు సరకదా.. ప్రతిఘటిస్తున్న టీడీపీ శ్రేణులపై దాష్టీకం చూపించారు. తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు నమోదుచేసి జైలుకు పంపించారు. చంద్రబాబు కుప్పంలో ఎప్పుడు పర్యటించినా అదే సీన్ కనిపిస్తోంది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటించినప్పుడు సైతం విధ్వంసం రేగింది. ఆ సభలో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారు. సెక్యూరిటీ అడ్డుకున్నారు. కానీ చంద్రబాబుపై చేసిన రాళ్ల దాడి కారణంగా ఓటీడీపీ కార్యకర్త గాయపడ్డారు. చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయారు. ఆ రాయి టార్గెట్ చేసింది చంద్రబాబునే. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ప్రణాళిక వేసినట్టు మాట వీడియో సైతం వెలుగుచూసింది. చంద్రబాబు సెక్యూరిటీలోకి పదే పదే ఇతర వాహనాలు వస్తున్నాయి. తరచూ అడ్డం పడుతున్నారు. చంద్రబాబు భద్రతను స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా లోపాలు ఉండేలా చేస్తున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్న బహిరంగ రహస్యం.

ఏపీలో పాలకుల సుంకుచిత మనస్తత్వాలకు దగ్గరగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్ఎస్జీ కమెండోలు లేకపోతే చంద్రబాబును ఫినిష్ చేస్తామని స్పీకర్ కామెంట్స్ చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొంత కాలంగా చంద్రబాబు చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమని తేలుతోంది. చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందని..కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ వ్యవస్థ చంద్రబాబు చుట్టూ జరుగుతున్న పరిణామాలను  ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై జరిగిన అతి పెద్ద కుట్రను కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు త్వరలో చేధిస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular