https://oktelugu.com/

Chandrababu Arrest : కోట్లు పోస్తేనేం.. కోరుకున్న న్యాయం ‘బాబు’కు దక్క లేదు?

నిజంగా కోట్టు పోసి తెచ్చిన లాయర్‌ ఎందుకు పనికి రాలేదు. ఒక తెలుగులాయర్‌ ఇక్కడ గెలిచాడు?

Written By:
  • Rocky
  • , Updated On : September 11, 2023 / 10:03 PM IST

    Sidharth Luthra

    Follow us on

    Chandrababu Arrest : విజన్‌ అని చెప్పినోడు, హైటెక్‌ సిటీ కట్టించా అని అన్నోడు, నవ్యాంధ్ర నిర్మాత అని చాటింపు వేసుకున్నోడు తొలిసారిగా జైలుకు వెళ్లాడు. ఇక నుంచి నేను నిప్పు అనే ఊత పదాన్ని వాడ లేడు. నిన్న ప్రత్యేక విమానంలో పాపులర్‌, ఎఫిషియంట్‌ లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వచ్చి, కంఠం పగిలేలా అరిచినా.. వాదనలు చెల్లలేదు. ఫలితంగా విక్టరీ సింబల్‌ డౌన్‌ అయింది. ఈనాడు, జ్యోతి కొట్టే డప్పులో బీట్‌ మారింది. బాబు మొహంలో నవ్వు మాయమైంది. విచారం ప్రతిబింబించింది. ఇక నిన్న రాత్రి నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైళ్లో ఉండాల్సి వచ్చింది. నిజంగా కోట్టు పోసి తెచ్చిన లాయర్‌ ఎందుకు పనికి రాలేదు. ఒక తెలుగులాయర్‌ ఇక్కడ గెలిచాడు? మన రాజకీయ నాయకులు వేదికల మీద తెలుగువాళ్లం మేం, గొప్పవాళ్లం మేం అని చాటింపు వేస్తారు గాని.. వారి కేసులకు వాదించేందుకు మన వారు పనికి రారా?

    మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ)  లాయర్లే దిక్కు అయినా, దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్న ట్టు మనోళ్ల ఏడుపు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా వచ్చాడు. కానీ ఏం చేశాడు? ఏమైనా చేయగలిగాడా? వాస్తవానికి మనం ఏదో ఒక సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, తెలుగోళ్లూ ముందున్న మాట నిజమే. కాని, సుప్రీంకోర్టులోగాని, మన తెలుగు హైకోర్టుల్లోగాని గట్టిగా వాదించి మన దక్షిణాది బలిసినోళ్లను కేసుల్లో గెలిపించే సత్తా ఉన్న ఒక్క తెలుగు వకీలూ ఇప్పటి దాకా లేరు. ఇంకా చెప్పాలంటే, కె.పరాశరన్‌, జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ వంటి తమిళులు, కేకే వేణుగోపాల్‌ వంటి కన్నడిగులు ఈ రంగంలో పేరు ప్రఖ్యా తులు సంపాదించారు గాని వారి స్థాయిని వారి మోకాళ్ల వరకైనా అందుకునే తెలుగు వారే లేకపోవడం దురదృష్టం.

    వైఎస్‌ రాజశేఖర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మార్గదర్శి వ్యవహారాన్ని కోర్టు దాకా లాగినప్పుడు రామోజీరావును అరెస్టు నుంచి కాపాడింది పార్సీ వకీలు ఎఫ్‌.ఎస్‌.నారిమన్‌. అప్పట్లో ఏపీ శాసనమండలిపై ’పెద్దల సభలో గలభా‘ అనే శీర్షికతో వార్త రాసినందుకు ఈనాడు గ్రూపు సంస్థల యజమాని చెరుకూరి రామోజీ రావు నాటి హైదరాబాద్‌ సిటీ పోలిస్‌ కమిషనర్‌ కే.విజ యరామారావు చేతిలో అరెస్టు కాకుండా దిల్లీ లాయర్‌ ఎఫ్‌ఎస్‌ నారిమన్‌ అత్యున్నత న్యాయస్థానంలో గట్టిగా వాదించి కాపాడారు. అలాగే, దివంగత నేత, అగ్రశ్రేణి క్రిమినల్‌ లాయర్‌ రామ్‌ జేఠ్మలానీ (దిల్లీలో స్థిరపడిన సింధీ) రామోజీ రావుకు ఒక కేసులో, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సీబీఐకి సంబంధించిన బెయిలు కేసులో ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించారు.

    తాజాగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ మాజీ సీఎం నారా చం ద్రబాబు నాయుడు తరఫున దిగువ స్థాయి ఏసీబీ కోర్టులో వాదిం చడానికి దిల్లీ పంజాబీ లాయర్‌ సిద్దార్థ లూథ్రా ఆఘమేఘాల మీద వచ్చారు. కానీ బెయిల్‌ ఇప్పించలేకపోయారు. స్థూలంగా చెప్పాలంటే కోట్లు పోస్తేనేం.. చంద్రబాబుకు కోరుకున్న న్యాయం దక్కాలనేం లేదు? వెరసి అన్ని రోజులూ మనవి కావు! అర్థమైనోళ్లకు అర్థమైనంత!