వ్యాక్సినేషన్ వేగవంతానికి కేంద్రం ఏర్పాట్లు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ప్రధాని ప్రకటించిన విషయం విధితమే. నూతన వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులు కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మరో 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు తయారీ సంస్థలు విక్రయించుకోనున్నాయి. ఇప్పటివరకు 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్రం […]

Written By: Srinivas, Updated On : June 21, 2021 3:17 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని ప్రధాని ప్రకటించిన విషయం విధితమే. నూతన వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ డోసులు కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మరో 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు తయారీ సంస్థలు విక్రయించుకోనున్నాయి. ఇప్పటివరకు 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్రం ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసింది.

నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి కూడా కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందించనుంది. దేశంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తుంది. మరో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కంపెనీలు విక్రయించేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ డోసులు అమ్మేందుకు నేషనల్ హెల్త్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది.

హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన వారు, రెండో డోసు పెండింగులో ఉన్న వారితోపాటు 18 ఏళ్లు నిండిన వారికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్లను ప్రభుత్వాలు అందించనున్నాయి. రాష్ర్టాల జనాభా, కరోనా వ్యాప్తి ఇప్పటివ రకు జరిగిన వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ వృథా లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు కేటాయించనుంది.

కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ డోసులకు అనుగుణంగా ఆయా రాష్ర్టాల్లోని జిల్లాలకు సమాచారం ఇవ్వనున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే వ్యాక్సిన్ డోసుల ధరను తయారీ సంస్థలు నిర్ణయించనున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు సర్వీస్ చార్జీల కింద డోసుకు ధర రూ.150 మించి వసూలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.