Best Features Cars : కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ మంచి ఫీచర్స్ ఉండి తక్కువ ధరకు లభించే కార్ల కోసం చూస్తుంటారు. కానీ ఫీచర్స్ బట్టి కారు రేటు మారుతూ ఉంటుంది. కానీ తక్కువ ధరకు లభించే కార్లలోనూ బెస్ట్ ఫీచర్స్ అమరుస్తున్నారు. దీంతో ఈ కార్ల కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ ను దృష్టిలో పెట్టుకొని రెండు కంపెనీలు రూ.10 లక్షలలో పు కార్లను తయారు చేసి వాటిలో అప్డేట్ అండ్ ఆకట్టుకునే ఫీచర్స్ ను సెట్ చేశారు. మరి అలాంటి కార్లు ఏవి? అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి?
దేశంలో ఎక్కడ కార్లు కనిపించినా అందులో ఒకటి మారుతి సుజుకీ కంపెనీకి చెందినది ఉంటుంది. దేశీయ ఆటోమోబైల్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నఈ కంపెనీ హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కంపెనీ చాలా వరకు కారు ధర తక్కువ ఉండేలా ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండి మిడిల్ క్లాస్ వారు సైతం కొనేలా ఆకట్టుకునే మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. వీటిలో సెలెరియో ఒకటి.
సెలెరియో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 బీహెచ్ పీ వపర్ , 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్ వేరియంట్ 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీ 35 కిలో మీటర్ల వరకు ఇస్తుంది. మారుతి సెలెరియా లో సేఫ్టీ ఫీచర్స్ తక్కువే. క్రాష్ టెస్టింగ్ లో దీనికి జీరో రేటింగ్ వచ్చింది. ఈ కారును రూ.5.57 లక్షల నుంచి రూ.7.14 లక్షల వకు విక్రయిస్తున్నారు.
దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతితో పాటు టాటా కంపెనీ పోటీ పడుతుంది. ఈ కంపెనీ నుంచి టియోగో మోడల్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మారుతి కంపెనీకి చెందిన సెలెరియోతో పోటీపడుతోంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 86 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ వేరియంట్ లో ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ ను అమర్చారు.
టియాగో మోడల్ తక్కువ బడ్జెట్ లో అందుబాటులో ఉంది. దీనిని రూ.5.60 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే గ్లోబల్ క్రాష్ టెస్టింగ్ లో టియాగో 4 స్టార్ రేటింగ్ పొందడంతో సేఫ్టీ కారుగా దీనిని భావిస్తున్నారు. టియాగో పెట్రోల్ వేరియంట్ లో19.01 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వేరియంట్ లో 26.49 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ రెండు కార్లలో సేప్టీ ఫీచర్స్ కావాలంటే టియాగో.. మైలేజ్ కావాలనుకుంటే మారుతి సెలెరియోను సెలెక్ట్ చేసుకోవచ్చు.