Reservations in the country: అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనది. స్వాతంత్ర్యానికి ముందు మన సమాజంలో ఎన్నో అసమానతలు. దళితులు ఊరికి దూరంగా గుడిసెలు వేసుకొని ఉండేవారు. వారికి దేవాలయాల్లోకి అస్సలు ప్రవేశం ఉండేది కాదు. ఈ క్రమంలోనే నాడు అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. దీంతో వారు బాగా చదువుకొని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు, అవకాశాలు పొంది ఇప్పుడు
ఆర్థికంగా సామాజికంగా స్థిరపడ్డారు. మెరుగైన స్థానాల్లో ఉన్నారు. దేశ ప్రధానిగా ఒక బీసీ అయిన మోడీ ఉన్నాడంటే అదొక గొప్ప సామాజిక సంస్కరణగా చెప్పొచ్చు. దేశ ప్రథమ పౌరుడుగా ఒక దళిత వ్యక్తి ఉన్నాడంటే మన రిజర్వేషన్ల గొప్పతనమే.

కానీ కాలం మారింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. నాటికి నేటికి చాలా సామాజిక ధోరణులు మారాయి. ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా స్థిరపడ్డారు. సంక్షేమ పథకాల నుంచి సామాజిక అవకాశాల వరకూ రిజర్వేషన్ల ద్వారా అందుకొని చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందారు. ఇతర రంగాల్లోనూ ఉపాధి పొందారు.
ఇదే సమయంలో అగ్రవర్ణాలు, ఇతర వర్గాల్లో పేదలు పెరిగారు. నాటికి నేటికి చాలా తేడాలున్నాయి. కానీ అగ్రవర్ణ పేదలను ఆదుకునే వారే కరువయ్యారు. ఎందుకంటే వారికి రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎప్పుడో వాటితో బాగుపడ్డారు.
అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శాంతకుమార్ కొత్త డిమాండ్ లేవనెత్తారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
Also Read: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 300 జాబ్స్.. రూ.25 వేల వేతనంతో?
‘కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని’ శాంతకుమార్ డిమాండ్ కు మద్దతు వెల్లువెత్తుతోంది. కుల ఆదారిత రిజర్వేషన్లపై దేశంలో 80శాతం మంది విసుగెత్తిపోయారు. రిజర్వ్ డ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తిగా లబ్ధి పొందడం లేదు.అందులోని సంపన్నులే లాభపడుతున్నారు’ అని బీజేపీ మాజీ సీఎం శాంతకుమార్ చేసిన డిమాండ్ న్యాయంగా కనిపిస్తోందంటున్నారు. ఈ వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. ఆదాయం పరంగా రిజర్వేషన్లు కల్పిస్తే దేశంలో అసమానతలు తగ్గే ఆస్కారం కలుగనుంది. ఈ దిశగా దేశం మారాలి.. రాజ్యాంగం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ఐఓసీఎల్ లో 300 ఉద్యోగ ఖాళీలు.. ఈ అర్హతలతో జాబ్ పొందే ఛాన్స్?