https://oktelugu.com/

ODI World Cup 2023 సెమీస్ : లెక్కసరిచేస్తారా? ధోని, విరాట్, రోహిత్ కన్నీళ్లకు బదులు తీసుకుంటారా..?

ఇప్పటికే రోహిత్ సేన తనదైన రీతిలో మంచి కసితో ఉంది.ఇక మన తో తలపడే టీమ్ ఏదైనా పర్లేదు గెలుపు మాత్రం మనదే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2023 / 09:32 PM IST
    Follow us on

    ODI World Cup 2023 : ఒక పోరాటం చరిత్ర లో చిరస్మరణీయంగా గుర్తుండి పోవాలంటే దాని వెనక చాలా మంది కోల్పోయిన జీవితాలు ఉంటాయి,ఒక గెలుపు మనం పొందాలంటే దాని చుట్టూ చాలా ఓటములు దాగి ఉంటాయి. ఒక్క విజయం ప్రపంచం లో మనల్ని హీరో ని చేస్తుందంటే ఆ సక్సెస్ ఎలా ఉండాలి అంటే మనవాళ్ళు శతాబ్దాల పాటు గర్వం గుండెలా మీద చెయ్యి వేసుకొని చెప్పుకునేలా ఉండాలి…వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ అలాంటి విజయాన్ని దక్కించుకునే సమయం ఆసన్నమైంది…

    వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా 8 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచినప్పటికీ అసలైన సమరం ఇప్పుడు మొదలైంది. విజయమా లేక వీర స్వర్గమా అనే రేంజ్ లో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్నాట్టు గా తెలుస్తుంది..ఇక ఇవాళ్ల శ్రీలంకతో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ విజయం సాధించడంతో 99% న్యూజిలాండ్ టీం సెమీస్ బెర్త్ ని కన్ఫామ్ చేసుకుంది. ఇదే క్రమంలో ఇండియా న్యూజిలాండ్ తో మరోసారి సెమీఫైనల్ లో తలపడుతుంది.

    2019 లో సెమీఫైనల్ మ్యాచ్ లో ఎదురైన ఓటమిని ఇప్పుడు న్యూజిలాండ్ మీద జరగబోయే మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకోవాలని ఇండియన్ టీమ్ భారీ ప్లాన్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా ఈ మ్యాచ్ లో తన సత్తా చాటితే ఆ టీమ్ మీద రివెంజ్ తీర్చుకొని మరో అద్భుతాన్ని క్రియేట్ చేసినట్టుగా అవుతుంది. ఈ మూమెంట్ కోసమే ప్రతి ఒక్క భారతీయుడు ఎదురుచూస్తున్నాడు. 2019 లో భారీ ఆశలతో సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన ఇండియన్ టీం ఆశల్ని అడియాశలు చేసిన న్యూజిలాండ్ టీం మీద రివెంజ్ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

    2019 లో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినప్పుడు ధోని ,విరాట్,రోహిత్ తోపాటు టీమ్ సభ్యులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే చివరి వరకు పోరాటం చేసి ధోని ఒక్కడు రన్ అవుట్ అవ్వడం వల్ల ఆ మ్యాచ్ ని ఓడిపోయి టోర్నీ నుంచి ఇండియా నిష్క్రమించడం జరిగింది. ఇక ఇప్పుడు మాత్రం అలాంటి సిచువేషన్ ఏది జరగదు ఎందుకంటే ఇండియన్ టీమ్ ఇప్పుడు అత్యంత బలమైన టీం గా కొనసాగుతుంది కాబట్టి ఇండియాని టచ్ చేసే టీం లేదు. ఇక దాంతో ఈసారి న్యూజిలాండ్ టీం కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇవ్వడానికి ఇండియన్ టీం రెడీ అవుతుంది…

    ఇప్పటికే రోహిత్ సేన తనదైన రీతిలో మంచి కసితో ఉంది.ఇక మన తో తలపడే టీమ్ ఏదైనా పర్లేదు గెలుపు మాత్రం మనదే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు క్రికెట్ అభిమానులు మాత్రం ఇండియన్ టీం న్యూజిలాండ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆ గాడ్ ఇలా డిజైన్ చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు…