Kalvakuntla Kavitha : కవితను ఈడీ అరెస్టు చేయవచ్చా?

ఇది ఎంతవరకు ప్రతిఫలం ఇస్తుందో తెలియదు గానీ.. ప్రతిపక్షాల్లో మాత్రం ఒక వణుకును మాత్రం బిజెపి సృష్టించిందని" రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత అరెస్టును కూడా రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. "గతంలో అరెస్టు చేస్తామని చేయలేదు. ఇప్పుడు చెప్పకుండా చేశారు. అంతే తేడా అని" వారు చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : March 15, 2024 10:36 pm

K Kavitha

Follow us on

Kalvakuntla Kavitha : “లిక్కర్ కేసు విషయంలో కవితను అరెస్టు చేస్తారని ఊహించలేదు. ఎందుకంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈనెల 19 కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మహిళలను విచారిస్తున్న సమయంలో సి ర్ పి సి నిబంధనలు పాటించడం లేదని కవిత ఆరోపించారు. తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని అందులో తెలిపారు. ఈ పిటిషన్ పై తీర్పు వెలువరించేంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు ఈడి తెలిపింది. అయినా ఆమెను అరెస్టు చేశారు” ఇదీ కవిత వ్యక్తిగత న్యాయవాది సోమా భారత్ వ్యక్తం చేసిన అభిప్రాయం.

నిజానికి భరత్ చేసిన అభిప్రాయం సరైనదే. వాస్తవానికి ఈడి కూడా సుప్రీంకోర్టు ఎదుట అప్పుడు అదే చెప్పింది. పైగా కవిత కేసు ఈనెల 19న విచారణకు వస్తుంది. అప్పటిదాకా ఈడీ కవితపై ఎటువంటి చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉండదు. కానీ అనూహ్యంగా శుక్రవారం కవితను అరెస్టు చేయడం న్యాయ కోవిదులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో కూడా కవితను అరెస్టు చేస్తారనే వార్తలు వినిపించాయి. ఆ మధ్య ఢిల్లీలో విచారించినప్పుడు ఇదే స్థాయిలో హడావిడి జరిగింది. కవిత తన వాడిన స్మార్ట్ ఫోన్లను ఈడి అధికారులకు అప్పగించింది. కానీ ఆ తర్వాత కేసు చప్పున చల్లారిపోయింది. అయితే ఇది కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లినట్టేనని అందరూ భావించారు. కానీ పార్లమెంటు ఎన్నికల ముందు ఒక్కసారిగా కవితను అరెస్టు చేసి ఈడి షాక్ ఇచ్చింది.

నిబంధనల ప్రకారం కవితను ఇప్పుడు అరెస్టు చేయకూడదని న్యాయనిపుణులు అంటున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు.. తుది తీర్పు వచ్చేందుకు సమయం ఉన్నప్పుడు.. అరెస్టు చేయడం సరికాదని చెబుతున్నారు. కానీ ఈడీ అధికారులు ప్రధానమంత్రి కి సమాచారం ఇవ్వకుండా ఈ దేశంలో ఏ వ్యక్తినీ అరెస్టు చేయాలని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు కవిత అరెస్టు సమాచారం ప్రధానమంత్రి కి ముందే తెలిసి ఉంటుంది. పైగా కేసు లో ఆధారాలు ఉన్నప్పుడు, బలమైన నేరాలకు పాల్పడినప్పుడు.. నేరస్తులను ముందే అరెస్టు చేసే అవకాశం ఈడికి ఉంటుందని తెలుస్తోంది. అందువల్లే కవితను అరెస్టు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో.. అది కూడా శుక్రవారాన్ని చూసుకొని ఈ డి అరెస్ట్ చేయడం విశేషం. ప్రత్యేక ఫ్లైట్ ద్వారా కవితను ఢిల్లీ తీసుకెళ్లిన ఈడి అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శనివారం, ఆదివారం కోర్టుకు సెలవులు కావడంతో ఈడి అధికారులు అత్యంత తెలివిగా కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. “పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం ద్వారా బిజెపి అటు రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా ఒక బలమైన సంకేతాలు పంపింది. ఈ ప్రకారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఎదురన్నదే లేకుండా చూసుకుంది. ఇది ఎంతవరకు ప్రతిఫలం ఇస్తుందో తెలియదు గానీ.. ప్రతిపక్షాల్లో మాత్రం ఒక వణుకును మాత్రం బిజెపి సృష్టించిందని” రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత అరెస్టును కూడా రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. “గతంలో అరెస్టు చేస్తామని చేయలేదు. ఇప్పుడు చెప్పకుండా చేశారు. అంతే తేడా అని” వారు చెబుతున్నారు.