https://oktelugu.com/

Bride Bike Ride : మండపానికి బుల్లెట్టు బండెక్కొచ్చిన పెళ్లి కూతురు.. పెద్దలు ఏమన్నారంటే? వైరల్ వీడియో

వధువును తీసుకెళ్లేందుకు ఆమె ఇంటిముందుకు కారు వచ్చి ఆగింది. అయితే అందరిలా తల దించుకొని కారులో వెళితే ఏముంటుంది? అని అనుకున్న ఆమె

Written By:
  • Srinivas
  • , Updated On : February 6, 2024 / 09:52 AM IST

    bride bike ride

    Follow us on

    Bride Bike Ride : ‘బుల్లెట్టు బండెక్కి వస్తావా..’ అనే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలియంది కాదు. ఈ పాట సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊర్రూతలూగించింది. తన కలల రాకుమారుడు బుల్లెట్టు బండిపై రావాలని ఓయువతి కోరుకుంటే ఎలా ఉంటుందనే నేపథ్యంలో దీనిని చిత్రీకరించారు. అయితే ఇక్కడ ఓ కలల రాకుమారుడు కాకుండా రాకుమారి బుల్లెట్టు బండిపై పెళ్లి మండపానికి వచ్చింది. సాధారణంగా పెళ్లి కూతురు తలదించుకొని కారులో వస్తుంటారు. కానీ ఈ వధువు మాత్రం హార్స్ పై వచ్చే రాకుమారుడిలా వచ్చింది. అసలేం జరిగిందంటే?

    కాలం మారుతున్న కొద్దీ పెళ్లి ప్రక్రియ మారుతోంది. ఒకప్పుడు వివాహం అనగానే చాలా మంది అమ్మాయిలు బయపడిపోయేవాళ్లు. కానీ నేటి కాలం అమ్మాయిలు తల్లిదండ్రులతో సంబంధం లేకుంటా పెళ్లి చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఓకే చెబుతున్నారు. అయితే తమ ఇష్ట ఇష్టాలను మాత్రం కాదనుకోవడం లేదు. తన పెళ్లి సందర్భంగా ఓ వధువు తల్లిదండ్రులను ఓ కోరిక కోరింది. అదేంటంటే?

    కాజల్ అనే అమ్మాయికి బైక్ రేసింగ్ ఇష్టం. ఈమె ఎక్కువగా బైక్ పై ప్రయాణాలు చేస్తుంటుంది. ఇటీవల ఆమె పెళ్లి కుదిరింది. వధువును తీసుకెళ్లేందుకు ఆమె ఇంటిముందుకు కారు వచ్చి ఆగింది. అయితే అందరిలా తల దించుకొని కారులో వెళితే ఏముంటుంది? అని అనుకున్న ఆమె తనకు ఇష్టమైన బుల్లెట్టుబండిపై మండపానికి వస్తానని తన తల్లిదండ్రులను కోరింది. అయితే తమ కూతురు కోరికను కాదనలేకపోయారు.

    దీంతో పెళ్లి కూతురు డ్రెస్సులో ముస్తాబైన కాజల్ బైక్ పై పెళ్లి మండపానికి వచ్చారు. గుర్రంపై రాకుమారుడిలా బుల్లెట్టు బండిపై పెళ్లి కూతురు రోడ్డుపై వస్తుంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇలా పెళ్లి కూతురు బండిపై రావడంపై కొందరు సాంప్రదాయవాదులు ఇదేమీ చోద్యం అంటూ గుసగుసలాడారు. యూత్ మాత్రం ఆమెకు సపోర్టు చేశారు.ఇక పెళ్లికూతురు ఇలా మండపానికి వస్తున్న వీడియోను తన స్నేహితుల్లో ఒకరు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇంకేముంది? అది కాస్త వైరల్ గా మారింది.