Facebook – Instagram Crashed : ఫేస్ బుక్ ఓపెన్ కావడం లేదు. ఇన్ స్టా గ్రామ్ తెరుచుకోవడం లేదు.. ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఎర్రర్ అని మెసేజ్ వస్తోంది. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం ఒక ప్రాంతానికి కాదు దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొనడంతో ఏం జరుగుతుందో అంతు పట్టడం లేదు. మరవైపు దీనిపై ఇంతవరకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పని చేయకపోవడంతో చాలామంది తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయేమోనని ఆందోళన చెందారు. కొంతమంది తమ ఖాతాలు తెరిచిన సమయంలో నమోదు చేసిన ఈమెయిల, ఫోన్ నంబర్లు ఎంటర్ చేసినప్పటికీ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ కాలేదు.
మనదేశంలో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో కోట్ల మంది ఖాతాలు కలిగి ఉన్నారు.. నిమిషానికి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లక్షల్లో సర్ఫింగ్ చేస్తుంటారు.. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా సందేశాలు పంపుతుంటారు.. ఇన్ స్టా గ్రామ్ లో కూడా మెసేజ్ లు సెండ్ చేస్తు చేస్తుంటారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ దాదాపు గంట నుంచి ఓపెన్ కాకపోవడంతో ట్విట్టర్ లో #Facebook down, #Instagram down అనే యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. చాలామంది తమ తెరుచుకోవడం లేదని #Mark Zuckerberg ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.. ఇంత జరుగుతున్నప్పటికీ ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.
గత కొంతకాలంగా ఫేస్ బుక్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. లే ఆఫ్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించింది. ప్రకటనల ఆదాయంలో కూడా మీడియా సంస్థలకు కోత విధించింది. దీంతో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా పలు దేశాల కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటోంది. ఇవన్నీ జరుగుతుండగానే ఫేస్ బుక్ ఆదాయంలో సింహ భాగం అందించే భారత్ లో సేవలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. మరి దీనిని ఫేస్ బుక్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఈ కథనం రాసే సమయం వరకు కూడా ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సేవలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఐతే ఇది సాంకేతిక లోపం? లేక ఎవరైనా హ్యాక్ చేశారా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.