https://oktelugu.com/

Rajamouli Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు మూవీ లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో…

దానివల్లే హృతిక్ రోషన్ అయితేనే ఈ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగలరు అనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో విలన్ గా నటించడానికి హృతిక్ రోషన్ ఒప్పుకుంటాడా ? అనే వార్తలు కూడా వస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2024 / 09:09 PM IST

    Rajamouli gave conditions to Mahesh Babu

    Follow us on

    Rajamouli Mahesh Babu : దర్శకధీరుడు అయిన రాజమౌళి సినిమా తీస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే…ఒక సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడతాడు అంటే ఆ సినిమాకి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ కాలర్ ఎగరేసుకొని మరి ఆ సినిమాని చూసి బయటికి పోవాలి, అనేలా తన సినిమాలో సీన్స్ ను డిజైన్ చేస్తాడు. దానికోసమే ఎన్ని రోజులైనా సరే కష్టపడతాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. ఇక అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే రాజమౌళి వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక దానికోసమే రాజమౌళి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి దీటుగా నిలబడగలిగే ఒక ప్రతి నాయకుడు క్యారెక్టర్ అయితే ఉంది. అందులో తెలిసిన హీరో అలాగే ఆ విలనిజాన్ని పండించే హీరో అయితే బెటర్ గా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో ఈ పాత్రని చేయించాలని రాజమౌళి అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ కోసం కొంతమంది నటులను చూసిన రాజమౌళి ఎవరితో కూడా ఈ క్యారెక్టర్ ను పోల్చి చూసుకోలేకపోతున్నారట.

    దానివల్లే హృతిక్ రోషన్ అయితేనే ఈ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగలరు అనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో విలన్ గా నటించడానికి హృతిక్ రోషన్ ఒప్పుకుంటాడా ? అనే వార్తలు కూడా వస్తున్నాయి.

    ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక భారీ సెట్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచే మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలని రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సెట్ మే నెలలో పూర్తవ్వనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే మే చివరి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది…