Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Rejected Movies: ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌దిలేసుకున్న బ్లాక్‌ బ‌స్ట‌ర్లు ఇవే.. ఈ...

Pawan Kalyan Rejected Movies: ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌దిలేసుకున్న బ్లాక్‌ బ‌స్ట‌ర్లు ఇవే.. ఈ సినిమాలు చేసి ఉంటేనా ?.. పవన్ ఇక దేవుడే !

Pawan Kalyan Rejected Movies: ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అనే పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అభిమానుల్లో పవన్ ఫాలోయింగ్ ఆకాశమంత, అందుకే పవన్ నుంచి సినిమా వ‌స్తుందంటే.. అభిమానుల్లో జోష్ తారాస్థాయికి చేరుతుంది. అసలు సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీసు బ‌ద్ద‌లు అవుతుంది. నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంకా రికార్డులు సృష్టించాల్సింది. పవన్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఇంతకీ ప‌వ‌ర్ స్టార్ త‌న కెరీర్‌లో వదులుకున్న ఆ బ్లాక్‌ బ‌స్ట‌ర్ సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

Pawan Kalyan Rejected Movies
Pawan Kalyan

ఇడియ‌ట్‌ :

ఇడియ‌ట్ సినిమా కోసం పూరీ జ‌గ‌న్నాథ్ ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అనుకున్నాడు. అయితే కథ విన్నాక, ఈ సినిమాలో కొన్ని సీన్లను మార్చాల‌ని ప‌వ‌న్ అడిగాడు. పూరి కూడా మార్చాడు. కానీ, అవి పవన్ కి నచ్చలేదు. అలా ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ సినిమా మిస్ అయ్యింది.

Also Read: Bigg Boss Telugu Season 6: ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆవిడే

Pawan Kalyan Rejected Movies
Idiot

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి :

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి క‌థ‌ను కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోస‌మే రాశాడు పూరీ. కిక్ బాక్సింగ్ చుట్టూ తిరిగే ఈ కథ పవన్ కి నచ్చింది. కానీ ఆ సమయంలో డేట్స్ కుదరలేదు. దాంతో ర‌వితేజ‌గా వచ్చిన అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే ర‌వితేజ‌కు మాస్ ఇమేజ్ ద‌క్కింది.

Pawan Kalyan Rejected Movies
Amma Nanna O Tamila Ammayi

అత‌డు :

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఇష్టపడి రాసుకున్న కథ ఇది. సినిమాలో పార్ధు క్యారెక్ట‌ర్‌ కు ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ పవన్ కళ్యాణ్ కి ఈ కథ కనెక్ట్ కాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ మ‌హేశ్ బాబు చేతిలోకి వెళ్లింది.

Pawan Kalyan Rejected Movies
Athadu

పోకిరి :

ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాల్సింది. డేట్స్ సెట్ అవ్వక మిస్ అయ్యింది. మ‌హేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ గా నిలిచిన ఈ సినిమా పవన్ కి పడి ఉంటే ఇంకా హిట్ అయ్యి ఉండేది.

Pawan Kalyan Rejected Movies
Pokiri

మిరపకాయ్‌ :

చాలామందికి తెలియదు, అండర్ కవర్ పాత్ర‌లో ర‌వితేజ న‌టించిన ఈ సినిమా పవన్ చేయాల్సింది. ప‌వ‌న్ కోసం హ‌రీశ్ శంక‌ర్ ఈ కథ సిద్దం చేసుకున్నాడు. అయితే, ఈ స్క్రిప్టు బాగున్నా.. ప‌వ‌న్ తనకు సూట్ కాదు అని నో చెప్పాడు.

Pawan Kalyan Rejected Movies
Mirapakay

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు :

వెంక‌టేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో వ‌చ్చిన గోపాల గోపాల సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో.. దిల్ రాజుకు ఈ సినిమా ఐడియా తట్టింది. దాంతో ఈ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంలో చిన్నోడు పాత్ర కోసం ప‌వ‌న్‌ కళ్యాణ్ అనుకున్నారు. కానీ పవన్ కి కథ నచ్చలేదు.

Pawan Kalyan Rejected Movies
Seethamma Vakitlo Sirimalle Chettu

ఒక్క‌డు :

మ‌హేశ్ బాబు న‌టించిన ఈ ది బ్లాక్ బాస్ట‌ర్‌ సినిమా కూడా మొదట పవన్ దగ్గరకే వెళ్ళింది. సీనియ‌ర్ రైట‌ర్ తోట ప్ర‌సాద్ ఆ మ‌ధ్య ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌ ఈ కథను మొదట పవన్ కి వినిపించాడు. కానీ, నిర్మాత ఎమ్మెస్ రాజు అప్పటికే మ‌హేశ్ కి కథ చెప్పడం, ప్రిన్స్‌ వెంటనే ఓకే అనడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. మొత్తానికి ఈ బ్లాక్‌ బ‌స్ట‌ర్లు పవన్ కి పడి ఉంటే.. పవన్ రేంజ్ ఊహించడం కూడా కష్టమే. ఆ స్థాయిలో ఉండేది.

Pawan Kalyan Rejected Movies
Okkadu
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version