BJP: ఒకే దెబ్బకు రెండు పిట్లలు కొట్టాలని కేంద్ర హోంమంత్రి.. బీజేపీ నేత అమిత్ షా స్కెచ్ గీసినట్టు సమాచారం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని.. కాబట్టి ఎన్నికల్లో పోటీచేసేందుకు అనేక నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండేలా చూసుకోవాలని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ రాష్ట్ర నేతలకు చెప్పినట్టు టాక్. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలన్నీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల వరకూ ఇదే రకమైన పరిస్థితిని కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది.

కేసీఆర్ ముందస్తు ఆలోచన తెలిసి అమిత్ షా అలెర్ట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులను రెడీ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అసంతృప్తిగా ఉన్న టీఆర్ఎస్ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలపై కూడా ఫోకస్ చేయాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం.
Also Read: ఓల్డ్ స్ట్రాటజీతో రేవంత్ రెడ్డి.. వర్కౌట్ అవుతుందా?
తెలంగాణలో తాము బలపడడంతోపాటు కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం కూడా బీజేపీకి ఎంతో ముఖ్యం. అందుకే రాష్ట్రంలో బలహీనంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ హైకమాండ్ సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని పార్టీలోకి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసేందుకు అనేక నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండేలా చూసుకోవాలని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ రాష్ట్ర నేతలకు చెప్పినట్టు టాక్.
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలన్నీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల వరకూ ఇదే రకమైన పరిస్థితిని కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి తామే ప్రత్యామ్మాయం అనే భావన ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ దానంతట అదే బలహీనమవుతుందని బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు కూడా బీజేపీ వైపు చూసే అవకాశం అమిత్ షా అండ్ కో స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. .
Also Read: 2021 రౌండప్.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఊహించని పరిణామం