BJP vs Congress : బీజేపీ భారత్‌ ను మర్చిపోయింది.. కాంగ్రెస్‌ సూపర్ రిప్లయ్‌ ఇచ్చింది

ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు విపక్ష కూటమి నాయకులు భారత్‌, ఇండియాగా వేర్వేరు అయిపోయారు.

Written By: NARESH, Updated On : November 19, 2023 9:02 pm
Follow us on

BJP vs Congress : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. ఈ రెండింట్లో ఏది కావాలో ఎన్నుకోండి అంటే రెండో దానినే బీజేపీ ఎన్నుకుంది. ఇండియా తక్కువ స్కోరు సాధించినప్పటికీ ప్రధాని సొంత రాష్ట్రంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండటంతో ఆదివారం ఉదయం నుంచి ట్విట్టర్‌ ఎక్స్‌లో ఇందుకు సంబంధించి అప్డేట్స్‌ ఇస్తూనే ఉంది. అయితే అనుకోకుండా బీజేపీ ఐటీ టీం చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా బీజేపీ ఐటీ టీం చేసిన ఆ ట్వీట్‌కు కాంగ్రెస్‌ వంత పాడింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలయింది. ఇంతకీ బీజేపీ ఏం చేసింది? కాంగ్రెస్‌ ఎందుకు వంత పాడింది? దాని వల్ల ఏం పర్యవసనాలు జరిగాయో.. ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.

ప్రధాని సొంత రాష్ట్రంలో..

దేశం మొత్తం క్రికెట్‌ మానియా ఆవరించింది. స్వదేశంలో జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీలో భారత జట్ల ఏకంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారత జట్టు ప్రదర్శనను ముందుగా ఊహించిందో లేక కావాలని చేసిందో తెలియదగాని ఐసీసీ ఫైనల్‌ వేదికను ఆహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. అనుకున్నట్టుగానే భారత జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదట్లో మెరుపులు మెరిపించిన భారత బ్యాటర్లు తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయ్యారు.

ట్విట్టర్‌ ఎక్స్‌లో ట్వీట్‌

ప్రధాని సొంత రాష్టంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో బీజేపీ ఐటీ టీం ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేయడం మొదలు పెట్టింది. భారత జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచే విధంగా ట్వీట్లు చేయడం ప్రారంభించింది. అయితే ఐటీ టీం చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. ‘కమాన్‌ టీం ఇండియా’ అని బీజేపీ ఐటీ టీం ట్వీట్‌ చేయగా.. ఈ ట్వీట్‌ ను కాంగ్రెస్‌ రీ ట్వీట్‌ చేసింది. దీనికి ‘ఇండియా గెలుస్తుంది’ అని కామెంట్‌ చేసింది. కొద్ది నెలల క్రితం ఇండియా పేరును భారత్‌ అని మార్చాలని మోడీ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులలో బారత్‌ అనే పేరు జోడించారు.దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయిన విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అనే పేరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు విపక్ష కూటమి నాయకులు భారత్‌, ఇండియాగా వేర్వేరు అయిపోయారు. కాగా, ఆదివారం యాదృశ్చికంగా బీజేపీ ఐటీ టీం ఇండియా పేరును ప్రస్తావించడం, దానిని కాంగ్రెస్‌ సమర్థించడం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.