రూపాయి ఫీజుకే విద్య.. రిటైర్మెంట్ తర్వాత కూడా టీచింగ్ చేస్తున్న మాస్టర్..?

దేశంలో రోజురోజుకు ప్రజలకు ఖర్చులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఖర్చులు పెరగడంతో డబ్బు సంపాదన గురించి ఆలోచించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విద్య, వైద్యం ఖర్చులు ఊహించని స్థాయిలో పెరగడంతో చాలామంది డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకోవాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపైటికెట్ బుకింగ్ ఈజీ..? అయితే కొంతమంది మాత్రం డబ్బు ఆశించకుండా నిస్వార్థంగా సేవ […]

Written By: Navya, Updated On : February 27, 2021 11:02 am
Follow us on

దేశంలో రోజురోజుకు ప్రజలకు ఖర్చులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఖర్చులు పెరగడంతో డబ్బు సంపాదన గురించి ఆలోచించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విద్య, వైద్యం ఖర్చులు ఊహించని స్థాయిలో పెరగడంతో చాలామంది డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకోవాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపైటికెట్ బుకింగ్ ఈజీ..?

అయితే కొంతమంది మాత్రం డబ్బు ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అలా నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన లోకేష్ శరణ్ ఒకరు. 61 సంవత్సరాల వయస్సు ఉన్న లోకేశ్ మాస్టర్ గతేడాది వరకు గవర్నమెంట్ టీచర్ గా పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత సేద తీరకుండా మాస్టారు పేద పిల్లలకు చదువు నేర్పిస్తూ కేవలం రూపాయి ఫీజును తీసుకుంటూ ఉండటం గమనార్హం.

Also Read: గూగుల్ లో సెర్చ్ చేయకూడని ఎనిమిది విషయాలు ఏమిటంటే..?

బీహార్ లోని సమస్తిపూర్ లో నివశించే లోకేశ్ తన తండ్రి పేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ మూతబడితే తన ఇంటి వాకిలినే పాఠశాలగా మార్చి ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటూ చదువు చెబుతున్నారు. 1986లో బీఏ పూర్తి చేసిన లోకేష్ రిటైర్ అయినా పేద విద్యార్థులకు చదువు చెప్పాలనే ఆశయంతో విద్యార్థులకు కేవలం రూపాయి ఫీజు తీసుకొని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు .

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

విద్యార్థుల చేతిరాత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వడంతో పాటు సివిల్‌ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. లోకేష్ మాస్టార్ నిస్వార్థ సేవను అందరూ మెచ్చుకుంటున్నారు.